కొత్త మున్సిపల్ చట్టంపై కాల్‌సెంటర్

Tue,October 8, 2019 03:15 AM

-ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తికి ఏర్పాటు
-కొత్త చట్టానికి అనుగుణంగా టౌన్‌ప్లానింగ్ నిబంధనలు
-పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తిచేసేందుకు కాల్‌సెంటర్ ఏర్పాటుచేయాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ప్రస్తుత టౌన్‌ప్లానింగ్ నిబంధనలను కొత్త మున్సిపల్ చట్టానికి అనుగుణంగా మార్చే విధానంపై ఆయన సోమవారం పురపాలకశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టౌన్‌ప్లానింగ్ నిబంధనల్లో ఎలాంటి గందరగోళం లేకుండా, వీలైనంత వరకూ ప్రజలకు అర్థమయ్యేలా సులభతరం చేయాలని సూచించారు. పట్టణ ప్రజానీకానికి టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన సమాచారం సులువు గా అందజేయాలని, ఇందులో మనుష్యుల ప్రమేయాన్ని వీలైనంతమేర తగ్గించాలని చెప్పారు. కొత్త పురపాలకచట్టంలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి విప్లవాత్మక నిర్ణయాల్ని పొందుపరిచామన్నారు.

అనుమతులన్నీ ఒకేచోట కాకుండా, అందుబాటులో ఉన్న పలు ప్రత్యామ్నాయ మార్గాలు.. మీ సేవ, మొబైల్‌యాప్, స్థానిక పట్టణసంస్థ వెబ్‌సైట్, యూఎల్బీలోని కియోస్క్‌లు వంటి వాటి ద్వారా అనుమతులు అందించే పద్ధతులకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి పట్టణానికి సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌లో డిజిటల్ డోర్‌నంబర్ల విధానాన్ని పొందుపర్చాలని సూచించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, డీటీసీపీ డైరెక్టర్ కే విద్యాధర్, జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ రిటైర్డ్ ఓఎస్డీ ఏవీ బీడే, డిప్యూటీ ప్లానర్లు పాల్గొన్నారు.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles