ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి.. హత్య


Sat,March 23, 2019 02:41 AM

Intoxicated teenager rapes murders six year old in Hyderabad

-హోలీ పండుగవేళ విషాదం
-12 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

జీడిమెట్ల: ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేసిన ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పోలీసులు నిందితుడిని 12 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజ వివరాలను వెల్లడించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ సమీపంలోని తుర్కపల్లి రైల్వేగేట్ వద్ద చేగూరి చంద్రం కుటుంబం నివాసం ఉంటున్నది. వారి కూతురు ప్రవళిక(6) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కెజీ చదువుతున్నది. గురువారం హోలీ సందర్భంగా ఆ బాలిక తన ఇంటి పక్కనే ఉన్న చిన్నారులతో కలిసి పండుగ జరుపుకొన్నది. చంద్రం, ఆయన భార్య కూలి పని ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెంది..రాత్రి 7 గంటల వరకు వెతికి.. ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీసీపీ పద్మజ నేతృత్వంలో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌తో గాలింపు చర్యలు ముమ్మ రం చేశారు. పోలీస్ జాగిలాలు రైల్వేట్రాక్ సమీపంలోని పొదల్లో తచ్చాడాయి. పోలీసులు పరిశీలించగా చిన్నారి మృతదేహం కనిపించింది. అనంతరం జాగిలాలు నేరు గా బాలిక ఇంటి సమీపంలోని మరో ఇంటికి వెళ్లి ఆగా యి. ఆ ఇంట్లో బీహార్‌కు చెందిన రాజేశ్‌కుమార్ (20), సురేంద్ర, సుబ్రహ్మణ్యం నివాసం ఉంటున్నారు. పోలీసులు ఆ ముగ్గురితోపాటు పక్కనే ఉంటున్న ధర్మేంధర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. రాజేశ్‌కుమార్ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసినట్టు తేలింది. హోలీ సందర్భంగా రాజేశ్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం కలిసి మద్యం సేవించారు. అనంతరం బాలిక సోదరుడికి రాజేశ్ డబ్బులు ఇచ్చి, రంగులు తేవాలని పంపాడు. బాలికను కిడ్నాప్ చేసి అల్వాల్ సమీపంలోని రైల్వేట్రాక్ పక్కనున్న చెట్ల పోదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కేక లువేయడంతో పక్కనే ఉన్న ఇనుప చువ్వతో బాదటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా స్థానికులు బాలిక మృతదేహంతో తుర్కపల్లి నుంచి ఏఆర్కే హోం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

4610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles