సీఎం ముందుచూపుతోనే హరితహారం


Wed,August 14, 2019 01:30 AM

Jagadish Reddy Participated In Haritha Haram Program In Suryapet dist

-తెలంగాణలో పెరుగుతున్న పచ్చదనం
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే హరితహారం కార్యక్రమం ప్రారంభమైందని విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. 2014కు ముందు మొక్కల పెంపకం అంటే కేవలం అటవీశాఖకు సంబంధించిన కార్యక్రమంలా ఉండేదనీ, హరితహారంతో ప్రస్తుతం సర్వజనితమైందని అన్నారు. మంగళవారం ఉద యం సూర్యాపేట మండలం ఇమాంపేట, రాజ్‌నాయక్‌తండాలో విద్యార్థులు, గ్రామస్తులు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక, కలెక్టర్ అమయ్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమా న్ని ప్రారంభించారు. సూర్యాపేట మండలవ్యాప్తంగా ఏకకాలంలో 4 వేల మందితో కలి సి 1.75 లక్షల మొక్కలు నాటారు. అనంత రం మంత్రి మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు దోహదం చేస్తాయన్నారు. ఉమ్మడి నల్లగొండలో కేవలం 3.5 శాతం.. సూర్యాపేట జిల్లాలో కేవలం 2.4 శాతం మా త్రమే ఉన్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల విస్తీర్ణం పెంచేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
haritha-chaitanyam

124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles