ఎదురొస్తున్న గోదారమ్మ


Tue,September 10, 2019 03:18 AM

Kaleshwaram Water flowing from Rajeshwararao Peta Pump House

-లక్ష్యం దిశగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం
-రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌లలో నడుస్తున్న మోటర్లు
-వరద కాల్వల మీదుగా ముందుకు సాగిన గోదావరి
-మంగళవారం తెల్లవారుజాము వరకు ఎస్సారెస్పీ జీరోపాయింట్‌కు జలాలు

కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఎస్సారెస్పీ పునర్జీవ పథకం లక్ష్యం దిశగా సాగుతున్నది. జగిత్యాల జిల్లా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌లలో మోటర్లు దిగ్విజయంగా ఎత్తిపోస్తుండగా.. కాళేశ్వర జలాలు ఎదురెక్కుతున్నాయి. ఇదివరకే నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లికి చేరిన గోదావరి జలాలు మంగళవారం తెల్లవారుజాము వరకు వరదకాల్వ జీరో పాయింట్‌కు చేరుకోనున్నాయి. దీంతో వరద కాల్వ 102 కిలోమీటర్ల మేర జలకళ సంతరించుకోనున్నది.

దిగ్విజయంగా ఎత్తిపోతలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌లో ఈనెల 4 నుంచి అంతర్గత తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 1, 2, 3, 4వ నం బర్ల మోటర్లను నడిపించిన అధికారులు, తిరిగి సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు 2, 3వ మోటర్లను రన్ చేశారు. కొత్తగా ఐదోనంబర్ మోటర్‌కు వెట్ ట్రయల్ రన్ చేసి, ఉదయం 11నుంచి గంటపాటు నడిపించా రు. ఎత్తిపోస్తున్న నీరు వరద కాల్వ గుండా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌కు చేరుకోగా, అక్కడ రెండు మోటర్లను నడిపిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి మూడో మోటర్‌ను, ఒంటిగంట నుంచి నాలుగో మోటర్‌ను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు వరద కాల్వ మీదుగా ఎస్సారెస్పీ వైపు కదిలింది.

కాల్వ పొడవునా జలకళ..

ఎస్సారెస్పీ నుంచి శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయం వరకు వరద కాల్వ మొత్తం 122 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాల్వ 102 కిలోమీటర్ల మేర జలకళను సంతరించుకోనున్నది. రామడుగు మండలం షానగర్ సమీపంలోని వరద కాల్వ (102 కిలోమీటర్) వద్ద హెడ్‌రెగ్యులేటరీ గేట్లు దించి ఉంచడంతో జలాలు ఎగువకు విస్తరించాయి. 73వ కిలోమీటర్ వద్ద ఉన్న మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. అక్కడ నాలుగు మోటర్లతో ఎత్తిపోయగా వరదకాల్వ 34వ కిలోమీటర్ వద్ద గల ఇబ్రహీంపట్నం మండ లం రాజేశ్వర్‌రావుపేటలోని పంప్‌హౌస్‌ను తాకాయి. ఇక్కడ కూడా నాలుగు మోటర్లతో ఎత్తిపోయగా.. జలాలు వరదకాల్వ మీదుగా ఎస్సారెస్పీ వైపు కదిలాయి.

759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles