మనవాటా 29 టీఎంసీలు


Fri,March 15, 2019 03:42 AM

Krishna Board Decides to Release 29 TMCs for Telangana 17 5 TMCs Water for AP

-రెండు రాష్ర్టాలకు కృష్ణా కేటాయింపులు
-ఏపీకి 17.5 టీఎంసీలు
-శ్రీశైలం, సాగర్ ఎండీడీఎల్ దిగువన విడుదలకు పచ్చజెండా
-శ్రీశైలంలో 800, సాగర్‌లో 505 అడుగుల వరకు తోడివేత
-గతంలోని రెండురాష్ర్టాల వినియోగం గతంగతః అని స్పష్టీకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎండాకాలం ప్రారంభంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలను మరింత తోడేసేందుకు కృష్ణా బోర్డు గేట్లు తెరిచింది. తెలంగాణకు 29 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎండీడీఎల్ దిగువన నీటిని పంచేందుకు జలసౌధలో గురువారం బోర్డు చైర్మన్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇటీవల సమర్పించిన 17 టీఎంసీల ఇండెంట్‌పై చర్చ జరిగింది. ఈ మేరకు నీళ్లు కావాలంటే ఏ జలాశయంలో ఎంత లోతుకు వెళ్లాలనేదానిపై లెక్కలు వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 827.40 అడుగులతో 46.98 టీఎంసీల నిల్వ ఉండగా... 800 అడుగుల లోతుకు వెళ్తే 18 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 524.20 అడుగులతో 123.337 టీఎంసీలున్నందున 505 అడుగుల వరకు పోతే అక్కడ 33.713 టీఎంసీలు.. మొత్తంగా 51.713 టీఎంసీల నిల్వ ఉన్నట్టుగా తేల్చారు. రెండు రాష్ర్టాలు ఇండెంట్లు సమర్పించగా 51.713 టీఎంసీల్లో తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.5 టీఎంసీలు కేటాయించి 46.5 టీఎంసీలు వాడుకునేందుకు కృష్ణా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది.

కేటాయింపులు ఇలా..

తెలంగాణకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు వరకు మిషన్ భగీరథ పథకం కింద ఐదు టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 8.5 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద చెరువులు నింపేందుకు మూడు టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద యాసంగికి తొమ్మిది టీఎంసీలు, శ్రీశైలం జలాశయం నుంచి ఆగస్టు వరకు కల్వకుర్తి ప్రాజెక్టుకు 3.5 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి ఇచ్చా రు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి శ్రీశైలం నుంచి హంద్రీనీవా, ముచ్చుమర్రికి మూడు టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు ఎనిమిది టీఎంసీలు, ఎడమ కాల్వకు మూడు టీఎంసీలు, కృష్ణా డెల్టాకు మూడున్నర టీఎంసీలు వాడుకునేందుకు అనుమతించారు. కృష్ణా డెల్టాకు శుక్రవారం నుంచే పది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని, కుడి, ఎడమ కాల్వలకు ఏపీ అడిగినపుడు విడుదలచేయాలని బోర్డు ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. నాగార్జునసాగర్‌లో వీలైనంత వరకు 510 అడుగుల నీటిమట్టం నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించింది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు నీటి విడుదల చేయాలని కోరింది.

శ్రీశైలం నీళ్లు వదిలేది ఎప్పుడు?

శ్రీశైలం నుంచి కల్వకుర్తి ప్రాజెక్టుకు 3.5 టీఎంసీలను, హంద్రీనీవాకు మూడున్నర టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఆరున్నర టీఎంసీలుపోగా మిగిలిన 11.5 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి వాడుకోవాల్సి ఉంది. దీనికోసం శ్రీశైలం నుంచి నీటిని సాగర్‌కు విడుదలచేయాలి. ఎప్పుటి నుంచి ఈ నీటిని విడుదల చేయాలో బోర్డు స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ నెల 11 వరకు రెండు రిజర్వాయర్లలో ఎండీడీఎల్ ఎగువన తెలంగాణకు సుమారు 27 టీఎంసీల వాటా మిగిలి ఉంది. వాస్తవంగా ఆ నిల్వల్ని మినహాయించి మిగిలిన నీటిని పంచాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా గతంగతః అంటూ ఉన్న నీటిలో 46.50 టీఎంసీలకు కేటాయింపులు జరిపింది. గతంలోని తెలంగాణ వాటా ఏం కావాలనే విషయంపై సాగునీటిరంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

1945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles