సొంతింటి నుంచే పారిశుధ్య డ్రైవ్


Wed,September 11, 2019 03:42 AM

KTR holds special sanitation drive in Hyderabad

-ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ పారిశుధ్య నిర్వహణ
-ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-సొంతింటి నుంచే పారిశుధ్య డ్రైవ్
-ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ పారిశుధ్య నిర్వహణ
-ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ డ్రైవ్‌లో పాల్గొనాలి
-వినియోగంలో లేని వస్తువులను తొలగించాలి
-ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధుల నివారణ సాధ్యమన్న కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బహిరంగప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని రకాలచర్యలు తీసుకుంటున్నారని.. ప్రతిఒక్కరూ వారి సొంత ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించాలంటే ప్రతి ఇంట్లో పరిశుభ్రత అత్యంత కీలకమన్నారు. పారిశుధ్యప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సోమవారం వైద్యారోగ్య, పురపాలకశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన కేటీఆర్.. మంగళవారం ప్రగతిభవన్‌లోని పరిసరాలను స్వయంగా శుభ్రంచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ktr-sanitation2
దోమలవృద్ధికి అవకాశంఉన్న నీటితొట్లను శుభ్రం చేశారు. ఉపయోగంలోలేని వస్తువులను తొలగించారు. నీరునిల్వ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లారు. ప్రతిఒక్కరూ సొంతింట్లో పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇండ్లముందు కానీ, లేదా లోపల కానీ నీరు నిల్వఉండకుండా చూడాలని, దీంతోపాటు ఇండ్లలో ఉపయోగంలేని వస్తువులను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడా ఉన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తమ ఇండ్లలో కూడా పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్, బాల్క సుమన్ తెలిపారు.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles