టిప్పర్‌ను ఢీకొన్న లారీ

Fri,November 8, 2019 01:55 AM

-రంగారెడ్డి జిల్లావాసి సజీవదహనం.. వైజాగ్ వద్ద దుర్ఘటన
మాడ్గుల: ఆంధ్రప్రదేశ్‌లోని విశా ఖపట్నం సమీపంలో గురువా రం తెల్లవారుజామున టిప్పర్‌ను ఢీకొన్న లారీలో మంటలు చెలరేగడంతో రంగారెడ్డి జిల్లా కలకొం డ గ్రామానికి చెందిన డ్రైవర్ ఏ నరసింహగౌడ్ (55) సజీవదహనమయ్యాడు. విశాఖపట్నంలోని పోర్టు నుంచి బొగ్గులోడు లారీ తో కోదాడకు వస్తున్న నరసింహగౌడ్.. వైజాగ్ శివారులోని లంకెలపాలెం జంక్షన్ వద్ద టిప్పర్‌ను ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో లారీ ముం దు భాగం నుజ్జునుైజ్జె క్యాబిన్‌లోకి మంటలు వ్యాపించడంతో నరసింహగౌడ్ అందులోనే సజీవదహనమయ్యాడని, ఆయనను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ మంటలు అధికంగా ఉండటంతో సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నరసింహగౌడ్‌కు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరు కూడా లారీ డ్రైవర్లుగానే పనిచేస్తుండగా.. సరస్వతి కూలీపని చేసుకొంటూ జీవిస్తున్నారు.

570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles