సీసీఎంబీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్ ప్రైజ్

Fri,November 8, 2019 02:25 AM

-లైఫ్ సైన్సెస్ విభాగంలో మంజులారెడ్డి ఎంపిక
-బ్యాక్టీరియా కణత్వచంపై పరిశోధనకు గుర్తింపు
-అవార్డుతోపాటు బంగారు పతకం, లక్ష డాలర్ల నగదు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) హైదరాబాద్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మంజులారెడ్డి ఇన్ఫోసిస్ ప్రైజ్‌కు ఎంపికయ్యా రు. బ్యాక్టీరియా కణత్వచం నిర్మాణం, సంశ్లేషణను అర్థం చేసుకోవటంలో విశేషకృషి చేసినందుకు ఆమె 2019 ఏడాదికి లైఫ్ సైన్సెస్ విభాగంలో పురస్కారానికి ఎంపికైనట్టు సీసీఎంబీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాక్టీరియా పెరుగుదల, విభజనల ప్రాథమిక దశలను తెలుసుకొంటే.. వాటి ద్వారా యాంటీబయోటిక్స్‌ని అభివృద్ధి చేయ డం సాధ్యమవుతుంది. ప్రతి 20 నిమిషాల వ్య వధిలో బ్యాక్టీరియా విభజన జరిగి వృద్ధి చెం దుతుంది.

ఒక ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థ ద్వారా తక్కు వ సమయంలోనే కణత్వచం నిర్మించుకొని.. ఒక కణం నుంచి రెండు కణాలుగా విభజన పూర్తిచేస్తుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన పరిశోధనలో మంజులారెడ్డి గుర్తించారు. కణత్వచం విభజన జరిగి నియంత్రిత విధానంలో కొత్త కణత్వచం ఏర్పడుతుందని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ, డాక్టర్ రెడ్డిస్ లాబోరేటరీలో తాజాగా జెనిటిక్, బయోకెమికల్‌ల ఉమ్మడి అధ్యయనంతో కణత్వచం నియంత్రిత విభజనను గుర్తించారు. మంజుల పరిశోధన వల్ల కొత్త కణత్వచం ఏర్పాటుకు ముందు జరిగే ప్రాథమిక దశలను నియంత్రించే వ్యవస్థను అర్థం చేసుకోవటం వీలవుతుంది. ప్రస్తు తం వాడుతున్న యాంటీ బయోటిక్స్ కణత్వ చం సంశ్లేషణ చివరిదశను లక్ష్యంగా చేసుకుంటాయి.

ఇకనుంచి ప్రారంభదశను లక్ష్యంగా చేసుకొనేలా యాంటీబయోటిక్స్‌ని రూపొందించేందుకు మార్గం సుగమమైంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోష ల్ సైన్సెస్ విభాగాల్లో ఇన్ఫోసిస్ ఈ పురస్కారాలను అందజేస్తున్నది. ఆరు విభాగాల్లో మొత్తం 196 నామినేషన్లు అందాయి. ఎంపికైనవారికి బంగారు పతకంతోపాటు లక్ష డాలర్ల నగదు అందిస్తారు. అవార్డును వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రదానం చేయనున్నారు.

263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles