విషజ్వరాల నియంత్రణకు చర్యలు


Wed,September 11, 2019 02:24 AM

Measures to control fever

-సెలవు రోజుల్లోనూ విధుల్లో వైద్యులు
-సీజనల్ జ్వరపీడితులకు తక్షణ వైద్యసేవలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న విషజ్వరాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీజనల్ జ్వరపీడితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా దవాఖానల్లో సెలవు రోజుల్లోనూ వైద్యులు ఓపీ సేవలను అందిస్తున్నారు. దోమల నిర్మూలన, రక్షిత తాగునీరు సరఫరాకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 1,697 గ్రామాలను హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ మలేరియా, డెంగీ, డయేరియా, కామెర్లు, టైఫాయిడ్, చికెన్‌గున్యా వ్యాధుల నియంత్రణ, నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఐటీడీఏ, గిరిజన ప్రాంతాల్లో పీహెచ్‌సీలు, పారా మెడికల్ సిబ్బంది వద్ద తగిన మందులు అందుబాటులో ఉంచారు.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల్లో మలేరియా.. ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో డెంగీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. హై రిస్క్ జిల్లాలుగా గుర్తించిన ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, మూసీనదిపై డ్రోన్ల సహాయంతో స్ప్రేయింగ్ చేస్తున్నారు. 15రోజులకు ఒకసారి ప్రతి స్కూల్‌లో ఫాగింగ్ చేయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో శానిటేషన్, దోమల నియంత్రణపై సంబంధిత విభాగాలు తరచూ సమీక్షిస్తున్నాయి.

అందుబాటులో ఔషధాలు.. అదనంగా అంబులెన్సులు

-పీహెచ్‌సీల్లో అవసరమైన ఔషధాలను, మలేరియా నిర్ధ్దారణ కిట్లను, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
-వరదనీరు చేరే ప్రాంతాల్లో అవసరానికంటే ఎక్కువగానే మందులను అందుబాటులో ఉంచారు.
-అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు అదనంగా అంబులెన్సులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
-అనుమానితులకు ఇండ్లవద్దనే మలేరి యా, డెంగీ, జ్వర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో దోమల నిర్మూలన చర్యలు చేపట్టారు.
-రాష్ట్రస్థాయిలో అంటువ్యాధుల నిర్మూలనా కేంద్రం ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు.
-వేగవంతంగా చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles