విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరినీ వదలం


Wed,April 24, 2019 02:28 AM

Minister Jagadish Reddy About Govt Committee On Inter Exams Results Controversy

-సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? త్రిసభ్య కమిటీ తేలుస్తుంది
-నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు
-విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొట్టే రాజకీయాలను విపక్షాలు మానుకోవాలి
-విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట టౌన్, నమస్తే తెలంగాణ: విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే నిందితులుగా తేలితే ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖమంత్రి జీ జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అపోహలకు పోయి ఆందోళన చెందవద్దని సూచించారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీ వేగవంతంగా పనిచేస్తున్నదని, నివేదిక అందగానే సాంకేతిక లోపమైతే ఆ సంస్థపైన, మానవ తప్పిదమైతే సంబంధిత అధికారులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు దీనిని రాజకీయంచేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని, కమిటీ నివేదిక అందకుండానే తమ అజ్ఞానాన్ని ప్రదర్శి స్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అనుమానం ఉన్న వారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప అపోహలకు పోయి తమ విలువైన జీవితాలను వృథా చేసుకోవద్దని సూచించారు. నిజంగానే సాంకేతికంగా తప్పులు జరిగినా, దానికి బాధ్యులెవరో గుర్తించి కఠినంగా శిక్షించేందుకు టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేశామన్నారు. నివేదిక అందగానే చర్యలు మొదలుపెడతామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క విద్యార్థినీ నష్టపోనివ్వబోమని భరోసానిచ్చారు. నిపుణుల కమిటీ బుధవారం సాయం త్రం లేదా గురువారం నాటికి నివేదిక ప్రభుత్వానికి అందించవచ్చని, దాని ఆధారంగా తప్పుతేలితే దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పారు.

5608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles