ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర

Tue,January 14, 2020 02:11 AM

- అధికారులతో సమీక్షలో మంత్రి సత్యవతిరాథోడ్‌
ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: మేడారం జాతరను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. సోమవారం మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రి సత్యవతిరాథోడ్‌ ములుగు ఐటీడీఏ అతిథిగృహంలో అధికారులతో సమీక్షించారు. మేడారం జాతర అభివృద్ధిపనుల్లో ఆశించినస్థాయిలో పురోగతి సాధించలేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. జంపన్నవాగులో నీటి నిల్వ సామర్థ్యం కోసం చేపట్టిన చదును పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాగుపై ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్‌కు రం గులు వేయాలని గతంలో సూచించినా అధికారులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 25 కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles