సమావేశాలు సరికొత్త రికార్డు

Mon,September 23, 2019 02:24 AM

-ప్రతిపక్షాలకు అవకాశమిచ్చాం
-అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
-ఒక్కనిమిషం వృథాకాని మండలి
-అసెంబ్లీలో మూడు నిమిషాలే వృథా
-మూడు బిల్లులకు ఆమోదం
-ఉభయసభలు నిరవధిక వాయిదా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాసనసభ, మండలి సమావేశాలు అర్థవంతంగా, ఫలవంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉభయసభలు నిరధికంగా వాయిదాపడిన అనంతరం ఆదివారం అసెంబ్లీ కమిటీహాల్‌లో చీఫ్ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకే సమావేశాలు నడుస్తాయని.. బడ్జెట్ సమావేశాలను 14 రోజులు నడపాలనే నిబంధన ఎక్కడాలేదని, దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ప్రతిరోజూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరుగంటలపాటు ఏ రాష్ట్రంలోనూ సమావేశాలు సాగలేదని అన్నారు. యురేనియం తవ్వకాలు జరపొద్దని ఉభయసభల్లో తీర్మానం ఆమోదించామని.. మున్సిపల్, సివిల్ కోడ్, ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం తెలిపిందని వివరించారు. సింగరేణి కార్మికులకు లాభా ల్లో 28శాతం వాటా ఇస్తూ సీఎం కేసీఆర్ సభ లో ప్రకటన చేశారన్నారు. మొహర్రం, వినాయక నిమజ్ఞనం ఉన్నా కూడా సమావేశాలు ప్రశాంతంగా సజావుగా సాగాయని, సహకరించిన పోలీసులు, అధికారయంత్రాంగానికి ధన్యవాదా లు తెలిపారు. ఉభయసభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఇచ్చినట్టు చె ప్పారు. ఉభయసభలు సజావుగా జరిగేలా కృషిచేసిన అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, చీఫ్‌విప్‌లు, విప్‌లు, ఫ్లోర్ లీడర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
vemula-prashanth-reddy1

సమావేశాలు సరికొత్త రికార్డు..

ఉభయ సభల నిర్వహణలో ఈ సారి సరికొత్త రికార్డు సృష్టించారు. ఎన్నడూ లేనంత సజావుగా సాగాయి. మండలి ఐదు రోజులు జరుగగా ఒక్క నిమిషం కూడా వృథా కాకపోగా.. పది రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు నిమిషాలు మాత్రమే వృథా అయింది. అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల్లో 58 గంటలు నిర్వహించారు. పదిరోజుల్లోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగింది.
vemula-prashanth-reddy2

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles