బీజేపీ విధ్వంసరచన


Wed,August 14, 2019 01:38 AM

MLA Balka Suman Fires On BJP Leader Laxman

-తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష
-రాష్ట్ర ఏర్పాటుపై అమిత్‌షాకు అక్కసు
-తప్పుడు ప్రచారంతో లబ్ధిపొందాలనే దురాలోచన
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు బీజేపీనేతలు మాట్లాడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. బీజేపీ నేతలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులుపారించి రాజకీయలబ్ధిపొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పథకాలకు రూ.24వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ సూచించినా ఒక్కరూపాయి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని డిమాండ్‌చేశారు. విభజనహామీల్లో పేర్కొన్న ట్రైబల్‌వర్సిటీ, హార్టికల్చర్‌వర్సిటీ, బయ్యారంలో ఉక్కుపరిశ్రమ, కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు ఏమయ్యాయని బాల్క సుమన్ ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయహోదా, నిధులు ఇవ్వాలని కేంద్రం చుట్టూ తిరిగితే ఒక్కనాడూ పట్టించుకోలేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును మూలన పడేయడంతోపాటు, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్ పెంపు బిల్లులను బీజేపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు.

ఆ రోజు చీకటిరోజు అవుతుందా!

రాష్ర్టాభివృద్ధికి సహకరించకపోగా అమిత్‌షా అడుగడుగునా తెలంగాణపై విషంచిమ్ముతున్నారని బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించినరోజును బ్లాక్‌డేగా అమిత్‌షా వర్ణించడం ఇక్కడి ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. బీజేపీ విద్వేషకర రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.

122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles