ఆగని ప్రయాణం

Tue,October 8, 2019 03:32 AM

-మూడోరోజూ సాఫీగాసాగిన రాకపోకలు
-50 శాతానికిపైగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
-అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ
-విధుల్లో ఆరువేలకుపైగా తాత్కాలిక సిబ్బంది
-ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కనిపించని సమ్మె ప్రభావం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా అధికార యంత్రాంగం తీసుకున్న ప్రత్యామ్నా య చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సమ్మె మూడో రోజైన సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తం గా బస్సులు యథావిధిగా నడిచాయి. మొదటి రెండ్రోజులు తలెత్తిన చిన్నచిన్న సమస్యలను సైతం అధికారులు అధిగమించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో అధికశాతం మంది దసరా సమయంలో ప్రశాంతంగా ఇండ్లకు చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు అదనం గా నడిపి రవాణా ఇక్కట్లను నివారించారు. రాష్ట్రవ్యాప్తంగా 50శాతానికిపైగా ఆర్టీసీ బస్సు లు తిరిగినట్టు అధికారులు తెలిపారు. ఆరువేల మందికిపైగా తాతాల్కిక డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. ప్రతి డిపోలో ప్రస్తుతమున్న డ్రైవర్ల కంటే అదనంగా 20 మందిని అధికారు లు రిజర్వులో ఉంచారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సెవన్‌సీటర్ ఆటోలను అందుబాటులోకి తెచ్చా రు. వాటికి తాత్కాలిక పర్మిట్లు జారీచేశారు. ప్రైవేట్ ట్రావెల్స్, వివిధ సంస్థల బస్సులను ఆయా రూట్లలో పంపిస్తున్నారు.

tsrtc2
ప్రధానంగా ఏసీ బస్సులు, లగ్జరీ సర్వీసులను దూరప్రాంతాలకు నడుపుతున్నారు. అన్నిరూట్లలో బస్సులు నడుస్తుండటంతో సమ్మె ప్రభావం కనిపించడం లేదు. ప్రయాణికులు ఇబ్బందులు పడటం లేదు. రవాణాశాఖ ఆధ్వర్యంలో డిపోల పరిధి లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌లను కొనసాగిస్తున్నారు. దసరా సందర్భంగా సెలవులు లేకుండా రవాణాశాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. 3,105 ఆర్టీసీ బస్సులు, 2,013 అద్దె బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాలు, స్కూలు, కాలేజీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్ మరో ఆరువేలకుపైగా నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించినట్టు పేర్కొన్నారు.

tsrtc3

కరీంనగర్ రీజియన్‌లో..

కరీంనగర్ రీజియన్‌లో సోమవారం 302 ఆర్టీసీ బస్సులు, 203 అద్దె బస్సులు నడిచాయి. 57 స్కూల్ బస్సులు, 43 కాంట్రాక్టు క్యారియర్లు తిరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 53 ఆర్టీసీ, 32 హైర్, 30 ప్రైవేట్ బస్సులు నడిచా యి. 53 మంది డ్రైవర్లు, 75 మంది కండక్టర్లు 14 వేల మందికిపైగా ప్రయాణికులను గమ్యాలకు తరలించారు. నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 283 బస్సులు నడిపారు. సుమారు 40 వేలమందిని గమ్యస్థానాలకు తరలించారు. సూర్యాపేట డిపోలో 111 బస్సులకుగాను 110 నడువగా వీటిలో 65 ప్రభుత్వ, 45 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. కోదాడ డిపోలో 83 ఆర్టీసీ, ఇతర ప్రైవేట్, 27 స్కూల్ బస్సులు, యాదగిరిగుట్ట డిపో పరిధిలో 34 ఆర్టీసీ, 15 అద్దె, 12 ప్రైవేట్ స్కూల్ బస్సులు తిరిగాయి.

tsrtc4

మెదక్ రీజియన్‌లో..

మెదక్ రీజియన్‌లో ఎనిమిది డిపోల పరిధిలో 672బస్సులకుగాను 502బస్సులు నడిచాయి. 332ఆర్టీసీ, 170 హైర్ బస్సులు తిరిగాయి. నిజామాబాద్ రీజియన్‌లో 366 బస్సులను నడిపించారు. ఇందులో 184 ఆర్టీసీ, 182 హైర్ బస్సులు ఉన్నాయి. 184 మంది డ్రైవర్లు, అంతేసంఖ్యలో కండక్టర్లు విధులు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 324 బస్సుల ద్వారా 50 వేల మంది ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకున్నారు.

tsrtc5

వరంగల్ రీజియన్‌లో..

వరంగల్ రీజియన్‌లో 942 బస్సులు ఉండగా, 505 బస్సులను నడిపించారు. మహబూబాబాద్ జిల్లాలో 106 బస్సులు తిరిగాయి. వనపర్తి డిపో నుంచి 55 ఆర్టీసీ, 24 అద్దె బస్సులు నడిపారు. ఖమ్మం డివిజన్‌లోని ఖమ్మం డిపో లో 46 ఆర్టీసీ, 56 అద్దె బస్సులు, మధిర డిపో నుంచి 30 ఆర్టీసీ, 20 అద్దె బస్సులు, సత్తుపల్లి డిపో నుంచి 65 ఆర్టీసీ, 36 అద్దె బస్సులను తిప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం డిపోలో 43 ఆర్టీసీ, 43 హైర్, మణుగూరులో 48 ఆర్టీసీ, 48 హైర్, భద్రాచలం డిపోనుంచి 54 ఆర్టీసీ, 54 హైర్ బస్సులు నడిచాయి. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 50 ఆర్టీసీ, 78 అద్దె బస్సులు, 70 క్యాబ్‌లు, 10 ఇతర వాహనాలు నడిచాయి. పరిగి డిపోలో 87 బస్సులకుగాను 49 బస్సులు, వికారాబాద్ డిపోలో 82 బస్సులకు 25 ఆర్టీసీ, 20 ప్రైవేటు బస్సులు, తాండూరు డిపోలో 93 బస్సులకుగాను 59 సర్వీసులను వివిధ రూట్లలో నడిపించారు.

2712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles