డీటీసీపీ కార్యాలయంలోకి పురపాలకశాఖ?


Wed,August 14, 2019 12:53 AM

Municipal office into the DTCP office

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సచివాలయంలోని పురపాలకశాఖ కార్యాలయాన్ని మాసబ్‌ట్యాంకులోని డీటీసీపీ కార్యాలయానికి తరలించనున్నట్టు సమాచారం. ఐదు అంతస్తులున్న డీటీసీపీ కార్యాలయంలో రెరా కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, టీయూఎఫ్‌ఐడీసీ తదితర కార్యాలయాలు ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భవనంలో రెండో అంతస్తు ఖాళీగా ఉండటంతోపాటు వాహనాల పార్కింగ్‌కు తగినంత స్థలం, ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండటం వల్ల అక్కడికి తరలించనున్నట్టు తెలుస్తున్నది. రెండో అంతస్తులో సర్దుబాటు చేయడానికి స్థలం లేకపోయినా ఇబ్బంది ఉండదు. కొంత భాగాన్ని ఏపీకి తరలిపోయిన సీడీఎంఏ కార్యాలయంలో సర్దుబాటు చేసేందుకు వీలుంటుంది.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles