ఆగమేఘాల మీద..

Tue,October 8, 2019 03:08 AM

మూసీ గేటు బిగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
సూర్యాపేట రూరల్: మూసీ నీటి ఉధృతితో ప్రాజెక్టు ఐదోనంబర్ రెగ్యులేటరీ గేట్ ఊడిపోవడంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెం టనే స్పందించడం, విషయాన్ని మరుక్షణమే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో 36 గంటల్లోనే డ్యాం వద్దకు కొత్త గేట్లు చేరనున్నాయి. ఊడిన గేటు 4 మీటర్ల ఎత్తు, 40 ఫీట్ల వెడ ల్పు ఉండగా తిరుపతి కల్యాణి డ్యామ్ వద్ద నుంచి తీసుకొచ్చేవి 0.6, 0.4 మీటర్ల ఎత్తు అంటే మొత్తం మీటరు ఎత్తు గల రెండు గేట్ల తో మూసీ డీఈ నవికాంత్ అక్కడి నుంచి కం టెయినర్‌లో సోమవారం బయలుదేరగా మంగళవారం ఉదయం వరకు మూసీకి తీసుకురానున్నారు. మిగిలిన 3 మీటర్ల ఎత్తులో ఉండే గేట్లను హైదరాబాద్‌లో తయారుచేస్తుండగా పనులు పూర్తికావచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ గేట్లు కూడా మంగళవారం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉండటంతో అన్నింటితో కలిపి 4 మీటర్ల ఎత్తుగల గేటు తయారు చేసి పాత గేటు స్థానంలో బిగించి నీటి లీకేజీని అరికట్టనున్నారు.


srsp2

14వేల క్యూసెక్కులు దిగువకు

మూసీ ప్రాజెక్టు గేటు ఊడిపోవడంతో మూడోరోజైన సోమవారం కూడా దిగువకు నీటి ప్రవాహం కొనసాగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. ఊడిపోయిన గేటు ద్వారా ప్రస్తుతం 14 వేల క్యూసెక్కులకుపైగా నీరు దిగువ మూసీలోకి వృథాగా వెళ్తున్నట్టు ఏఈ మమత తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 635 అడుగులు (2.10 టీఎంసీలు)గా ఉన్నది. శనివారం సాయంత్రం గేటు ఊడిపోగా ఇప్పటివరకు 10 అడుగుల (2.35 టీఎంసీలు) నీరు దిగువకు వృథాగా వెళ్లింది.

1398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles