ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం


Sat,March 23, 2019 03:19 AM

Nalgonda Warangal Khammam Teachers Segment 8925pr

-పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్
-26న ఓట్ల లెక్కింపు
-పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్
-నల్లగొండ- వరంగల్- ఖమ్మం టీచర్స్ సెగ్మెంట్‌లో 89.25%
-కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్స్ సెగ్మెంట్‌లో 83.54శాతం, గ్రాడ్యుయేట్స్ సెగ్మెంట్‌లో 59.03 శాతం పోలింగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నల్లగొండ-వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో అత్యధికంగా 89.25 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో 59.03 శాతం పోలింగ్ నమోదైనట్టు సీఈవో కార్యాలయం వెల్లడించింది. కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ ఉపాధ్యాయ నియోజక వర్గం లో 83.54 శాతం పోలింగ్ జరిగింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదవగా.. పట్టభద్రులు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులు పాతూరి సుధాకర్‌రెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఉన్నతాధికారులతో పాటు ఎంపీల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పో లింగ్ కేంద్రాలవద్ద పట్టిష్ఠ బందోబస్తుతోపాటు వెబ్‌కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 26న ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగనుంది. కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మెదక్ జిల్లా తూప్రాన్‌లో అత్యధికంగా 67.79 శాతం, నిజామాబాద్‌లో అత్యల్పంగా 50.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలోనూ మెదక్ జిల్లా తూప్రాన్‌లోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. 93.31 శాతం మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో 89.25 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ అత్యధికంగా నల్లగొండలో 92.85 శాతం టీచర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కరీంనగర్‌లో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, జగిత్యాల ఉన్నత పాఠశాలలో ఆర్థికసంఘం చైర్మన్ గొడిశెల రాజేశంగౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, అభ్యర్థి టీ జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎస్పీ సింధూశర్మ, మెట్‌పల్లిలో విద్యాసాగర్‌రావు, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

2350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles