అవినీతిపరులు అనర్హులే


Mon,April 15, 2019 02:06 AM

new Panchayati Raj Act has imposed several norms in section 2108 of 210

-పరిషత్ ఎన్నికలకు మార్గదర్శకాలు జారీ
-ఏ రకమైన అవినీతికి పాల్పడినా పోటీకి దూరం
-8 గుర్తులతో ఒక వరుస బ్యాలెట్
-సమగ్ర విచారణ తర్వాతే ఏకగ్రీవాల ప్రకటన
-ఒకే స్థానం నుంచి పోటీచేయాలి
-రెండు స్థానాల్లో నామినేషన్ వేస్తే తిరస్కరణ
-బ్యాంక్ ఖాతా నుంచే ప్రచార ఖర్చులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. అభ్యర్థుల అనర్హత నిబంధనలను ఖరారుచేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లోని 210లో పలు సెక్షన్లను అనుసరిస్తూ ఈ నిబంధనలను విధించింది. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలతోపాటు రిటర్నింగ్ అధికారుల విధులు, బ్యాలెట్ పత్రాల తయారీ, అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్లను స్పష్టంచేస్తూ మార్గదర్శకాలను జారీచేసింది.

అవినీతికి పాల్పడితే అనర్హతే

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, సురక్షిత పాలనకు కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని అనుసరిస్తూ అనర్హతలను ఖరారుచేశారు. ఇందులో భాగంగా అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోకుండాచేశారు. ప్రభు త్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధీనంలో ఉండే కార్యాలయాల్లో పనిచేస్తూ లం చం తీసుకున్నా లేదా ఇతర మోసాలకు పాల్పడినా.. విశ్వాసఘాత నేరాల కింద.. ఉద్యోగులైనా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టంచేశారు. అవినీతి, ఆరోపణలపై తొలిగించబడినవారు ఐదేండ్ల కాలపరిమితి వరకు అనర్హులని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటివరకు పలు పదవుల్లో, ప్రజాప్రతినిధులుగా ఉండి, అవినీతి, ఆరోపణలు రుజువై పదవుల నుంచి తొలిగించబడినవారు కూడా పోటీకి అనర్హులే. లంచాలకు, దుష్ప్రవర్తనకు పాల్పడినా.. అలాంటి వాటిలో ప్రమేయం ఉన్నట్టు రుజువైనా ఆరేండ్ల వరకు పోటీచేయరాదు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో విధుల నిర్వహణ, కార్యాచరణలో విఫలమైన సందర్భాల్లో పదవి నుంచి తొలిగించబడిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పోటీచేసేందుకు అనర్హులు.

ఇతర పాలకవర్గాల్లో ఉంటే అనర్హులే..

ఇక ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గాల్లో సభ్యుడిగా ఉండటం, పదవీకాలం ఇంకా పూర్తి కాకపోవడం, ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతున్న సమయానికి పదవీకాలం ముగియకపోవడం, గ్రామ పంచాయతీలకు పాలకవర్గ సభ్యుడిగా ఇదివరకే ఎన్నికైనప్పటికీ పదవీ కాలం ఇంకా ప్రారంభం కానప్పటికీ పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదని రాష్ట్ర ఎ న్నికల సంఘం స్పష్టంచేసింది. తెలంగాణ మున్సిపల్‌చట్టం కింద ఏర్పాటైన నగర పంచాయతీలు లేదా మున్సిపాలిటీల్లో సభ్యుడు లేదా ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఏదైనా చట్టం కింద ఏర్పాటైన మున్సిపల్ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నా అనర్హులే. గ్రామ పంచాయతీలకు ఏదైనా ధర్మకర్త హోదాలో ఉండి, ప్రభుత్వానికి చెల్లించే పన్నులు బకాయిలుండి, నోటీసులు జారీ అయినా.. నిర్ణీత వ్యవధిలో బకాయి చెల్లించని వారు కూడా పోటీచేసేందుకు అనర్హులు. వీటితోపాటు ఐపీ పెట్టిన వారు, ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, మతిస్థిమితం లేనివారు, ఆర్థిక నేరాలకు పాల్పడే వారు పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఎన్నికల ఖర్చులు చూపించని వారిని కూడా పోటీకి దూరంచేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన వారు చాలా మంది ఖర్చు చూపించలేదు. చాలా మంది ఆశావహులుగా ఉండటంతో వారంతా పోటీచేస్తే ఎన్నికల ఖర్చు చూపించాలని నిబంధనలు విధించారు. గతంలో పోటీచేసి ఖర్చు చూపించని వారిపై ఫిర్యాదులు కూడా స్వీకరించనున్నారు.

ఎనిమిది గుర్తులతో ఒకే వరుస బ్యాలెట్

బ్యాలెట్ ముద్రణలో సైతం మార్గదర్శకాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలిచ్చారు. ఎనిమిది గుర్తులతో ఒకే వరుస బ్యాలెట్‌ను ముద్రించాలని సూచించారు. ఉదాహరణకు ఏడుగురు అభ్యర్థులు ఉంటే ఏడు గుర్తులు, ఒక నోటా గుర్తుతో కలిసి ఒక వరుస బ్యాలెట్ ఉండనున్నది. ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎనిమిది గుర్తులతోపాటు నోటా గుర్తుతో మరో వరుస బ్యాలెట్ ముద్రించనున్నారు. రెండు వరుసల్లో మొత్తం 16 గుర్తులు.. 15 గుర్తులు, నోటా గుర్తుతో రెండు వరుసల బ్యాలెట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే మరో బ్యాలెట్‌ను జోడించనున్నారు.

సమగ్ర విచారణ తర్వాతే ఏకగ్రీవాల ప్రకటన

సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాతే ఏకగ్రీవాలపై ప్రకటన చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ తర్వాత రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవాలను ప్రకటించరాదని, జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణ తర్వాతే ప్రకటన చేయాలని సూచించారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది వరకు ఓటర్లుంటే.. ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు పోలింగ్ అధికారులు, 401 నుంచి 600 వరకు ఓటర్లున్న పోలింగ్ బూత్‌ల్లో ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు ఐదుగురు పోలింగ్ అధికారులు ఉండాలని మార్గదర్శకాల్లో సూచించారు.

చాలెంజ్ ఓటుకు చాన్స్

ఓటరు గుర్తింపుపై ఈసారి పరిషత్ ఎన్నికల నేపథ్యంలో చాలెంజ్ ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి చాలెంజ్ ఓటుకు సదరు ఓటరు రూ.5 ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి, రసీదు తీసుకోవాలి. అనంతరం చాలెంజ్ ఓటుపై పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో విచారణ చేయాలి. విచారణలో చాలెంజ్ రుజువు కాకుంటే.. సదరు ఓటరును ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ అధికారులు అనుమతిస్తారు. ఒకవేళ చాలెంజ్ రుజువు చేస్తే.. అంటే సదరు ఓటరు నిజమైన ఓటరు కాదని విచారణలో తేలితే ఆ వ్యక్తిని ఓటు వేయకుండా అడ్డుకొని, రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశం ప్రిసైడింగ్ అధికారులకు కల్పించారు.

బ్యాంక్ ఖాతాల నుంచే ఎన్నికల ఖర్చులు

పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచార ఖర్చును కచ్చితంగా బ్యాంకు ఖాతాల నుంచే వెచ్చించాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. నామినేషన్ల సమయంలోనే రిటర్నింగ్ అధికారికి బ్యాంక్ ఖాతా నంబర్లు, పాస్‌బుక్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంపీటీసీ స్థానమైనా, జెడ్పీటీసీ స్థానానికైనా పోటీచేసే అభ్యర్థులు ఒకే స్థానం నుంచి నామినేషన్లు వేయాలి. రెండు స్థానాల్లో పోటీ చేస్తామని నామినేషన్లు దాఖలుచేస్తే వాటిని తిరస్కరించనున్నారు. పరిషత్ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల నేర చరిత్ర, కేసులు, విద్యార్హతపై డిక్లరేషన్ తీసుకోనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇస్తే వారిని ఎన్నికలకు దూరం చేయడమే కాకుం డా.. కేసులు నమోదు చేయనున్నారు.

3426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles