పసుపుబోర్డు హామీ ఏమైంది?


Wed,August 14, 2019 01:33 AM

nizamabad-farmers-hold-meeting-demand-msp-for-turmeric-sorghum

-వారంలోగా ఇస్తామన్నారు?
-బీజేపీ నేతలను కడిగి పారేసిన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
-సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

నిజామాబాద్, నమస్తేతెలంగాణ ప్రతినిధి: వారంలోగా పసుపుబోర్డు ఇస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ పరిశీలకులు ప్రొఫెసర్ బీ నాగేశ్వర్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. పసుపుబోర్డుపై బీజేపీ ఇచ్చిన హామీ గురించి నాగేశ్వర్ మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో సారాం శం ఇలా.. ఇప్పటివరకు కేంద్రం నుంచి పసుపుబోర్డు ఇస్తున్నట్టుగా సంకేతాలు ఏవీ రాలేవు. పైగా పసుపు బోర్డు అవసరం లేదంటూ, మద్ద తు ధర ఇస్తే చాలంటూ రైతుల అభిప్రాయాల పేరిట బీజేపీ కొత్త పల్లవి అందుకున్నది. వారంలో నే పసుపుబోర్డు ఇస్తాం చూడండి అంటూ లోక్‌సభ ఎన్నికలప్పుడు ఎంపీ అభ్యర్థిగా అర్వింద్, ఢిల్లీ స్థాయి నేత రాంమాధవ్ హామీ ఇచ్చారు.

పసుపుబోర్డు కావాలనే ఆకాంక్ష, డిమాండ్ రైతుల్లో బలంగా ఉన్నది. దేశంలో 80శాతం పసుపు ఉత్పత్తి జరుగుతుం టే సింహభాగం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో సాగవుతున్నది. బోర్డు వస్తే మద్ద తు ధర లభిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడి రైతులు పోరాడుతున్నారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గుర్తుచేశారు. పసుపు ఎగుమతులను ప్రోత్సహి స్తే వ్యాపారికి కాకుండా రైతులకు లాభాలు వ స్తాయని, ఎన్నికల వాగ్దానాన్ని ఎందుకు మర్చిపోతున్నారో, పసుపుబోర్డు వద్దనే అభిప్రాయాన్ని, ఆ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన బీజేపీ నేతలను నిలదీశారు.

482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles