ఢిల్లీలో గులాబీ ఉండాల్సిందే..


Sat,March 23, 2019 03:12 AM

Nizamabad TRS MP Candidate Kavitha Files Nomination For Telangana Lok Sabha Elections 2019

-అప్పుడే అరువై ఏండ్ల గులాంగిరీ పోతది
-సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశవ్యాప్తంగా అమలు జరుగాలి: ఎంపీ కవిత
-మానిక్‌బండార్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం

నిజామాబాద్, నమస్తేతెలంగాణప్రతినిధి: గల్లీలో.. ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఉంటే అరువై ఏండ్ల గులాంగిరీ పోతదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా మా క్లూర్ మండలం మానిక్‌బండార్ గ్రామం నుంచి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, స్థానిక నాయకులతో కలిసి ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కవిత మాట్లాడుతూ... మానిక్‌బండార్ గ్రామస్థులు గత ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నిజామాబాద్ పార్లమెం ట్ నియోజకవర్గానికి దాదాపు రూ.17వేల కోట్లు నిధులు తీసుకువచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే 70ఏండ్లుగా ఎన్నడూ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. రాష్ర్ట అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, కొట్లాడి గుంజుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు.
Kavitha1
రేపు ఢిల్లీలో కూడా అదే జరుగాలన్నారు. కొట్లాడి గుంజుకునే విధంగా హక్కుల కోసం పోరాడే టీఆర్‌ఎస్ ఢిల్లీలో ఉంటేనే లాభం జరుగుతుందన్నారు. ఢిల్లీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గల్లీలో ఉంటే ఎంపీలు గా, ఎమ్మెల్యేలుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తామని, ఢిల్లీలో ఉంటే ప్రజల సైనికుల మాదిరిగా పోరాటం చేస్తామన్నారు. మొన్న పన్నెండు మంది ఎంపీలను గెలిపిస్తే ఇరువై ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్-పెద్దపల్లి రైల్వేలైన్‌ను సాధించామన్నారు. ఈ పనులకు కాంగ్రె స్ నాయకులు అడ్డుపడితే జీవన్‌రెడ్డి, తాను కలి సి పనులు కొనసాగేలా చేసి మూడేండ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. లక్కంపల్లిలో సెజ్‌ను ఓపెన్ చేస్తామని ఆనాడు చెప్పిన మాదిరిగానే సాధించామన్నారు. కేంద్రం నుంచి రూ. 100 కోట్లు రాబట్టామన్నారు. ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో వితంతు పింఛన్ రూ.750 ఇస్తున్నారని, తెలంగాణలో రూ. 2 వేలు ఇస్తున్నారని, బీజేపీ కావాల్నా, టీఆర్‌ఎస్ కావాల్నా ప్రజలు తేల్చుకోవాలని కోరారు.
Kavitha2

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేతలు

-గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ కవిత
నిజామాబాద్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాగారెడ్డి, రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి తారాచంద్ వారి అనుచరులతో కలిసి శుక్రవారం పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ కవిత వీరికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ఇతరపార్టీల నాయకులు టీఆర్‌ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఎంపీ కవిత సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని దేశమంతటికీ తెలియజేసేందుకు పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, ఆకుల లలిత, నాయకులు రాంకిషన్‌రావు, విఠల్‌రావు, ఈగ గంగారెడ్డి పాల్గొన్నారు.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles