రాజలరాజేశ్వర


Mon,August 26, 2019 01:55 AM

Ongoing Water Release to Gayatri Pumphouse

-రికార్డుస్థాయిలో 11 టీఎంసీలకు నీటిమట్టం!
-17 కిలోమీటర్ల మేర విస్తరించిన బ్యాక్‌వాటర్
-నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో నిరంతరంగా నడుస్తున్న మోటర్లు
-గాయత్రి పంప్‌హౌస్‌కు కొనసాగుతున్న నీటి విడుదల

కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలల ప్రతిరూపంగా సాకారమైన కాళేశ్వరం ప్రాజెక్టులో జలప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల లింక్-2లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ రికార్డు సృష్టించింది. జలాశయంలో నీటిమట్టం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆదివారం పది టీఎంసీల మార్కు దాటింది. దిగువన నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో మోటర్లు నిరంతరం కాళేశ్వర జలాలను ఎత్తిపోస్తుండటంతో ఆదివారం రాత్రి పదిగంటల వరకు నీటి నిల్వ 10.623 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ 17వ కిలోమీటర్ వరకు అంటే.. సిరిసిల్ల మండలం శాంతినగర్ సమీపంలోని రామప్ప ఆలయం దాటి, మానేరు వెంబడి కరకట్ట ప్రారంభం దాకా విస్తరించింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 25.873 టీఎంసీలు కాగా సోమవారం తెల్లవారుజాము వరకు జలాశయం లో నీటిమట్టం 11 టీఎంసీల మార్కును దాటనున్నట్లు అధికారులు తెలిపారు.
Gayatri-Pump-House1

నిరంతరం ఎత్తిపోతలు..

ఆరో ప్యాకేజీ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఆదివారం 1, 2, 3 మోటర్ల ద్వారా నంది రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోతలు కొనసాగాయి. నంది రిజర్వాయర్ నుంచి ఆరు గేట్ల ద్వారా ఎనిమిదో ప్యాకేజీ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడ 1, 4, 5 మోటర్లు ఎత్తిపోస్తున్న నీళ్లు డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసిపడి గ్రావిటీ కెనాల్ గుండా వరదకాల్వలో కలిసి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి చేరుతున్నాయి. జలాశయానికి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు.

తాలిపేరు నాలుగు గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తాలిపేరు ప్రాజెక్టులోకి ఆదివారం భారీగా వరదనీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 12,560 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదలచేశారు. భద్రాచలం వద్ద నీటి ప్రవాహం మధ్యాహ్నం 31.7 అడుగులుగా ఉన్నది.

కృష్ణా బేసిన్‌లో మళ్లీ ఇన్‌ఫ్లోలు

కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు మళ్లీ ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. ఆదివారం కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల వరద రాగా, అంతేమొత్తంలో దిగువకు విడుదలచేస్తున్నారు. నా రాయణపుర రిజర్వాయర్‌కు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 7,783 క్యూసెక్కులను దిగువకు విడుదలచేస్తున్నారు. దీంతో జూరాల కు 9 వేల క్యూసెక్కుల వరద రాగా, 6,977 క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 11 వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో నమోదైంది. జూరాల, తుంగభద్ర నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయానికి 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
NLG1-sagar
Gayatri-Pump-House3

5550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles