జీడీపీ తగ్గింది.. నిరుద్యోగం పెరిగింది!


Wed,September 11, 2019 02:41 AM

Owaisi hits out at Modi govt's 100 day rule

- మూక హత్యలను ప్రోత్సహిస్తున్నారు
- మోదీ వంద రోజుల పాలనపై అసద్ ధ్వజం


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు వంద రోజుల పాలనపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు కురిపించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు మందగించిందని, నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నదని, వాహనరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. మం గళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వంద రోజుల్లో 35 రోజులు కశ్మీర్‌లో ఇంటర్నెట్ లేదు. పాఠశాలలు తెరుచుకోలేదు. జీడీపీ ఐదు శాతానికి దిగజారింది. నిరుద్యోగిత రేటు ఆరు శాతం కంటే ఎక్కువ నమోదైంది. వాహనరంగంలో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పాలన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. కశ్మీర్‌లో ప్రాథమిక హక్కులను కాలరాశారని ధ్వజమెత్తారు. దేశంలో మూక హత్యల నిందితులను ప్రోత్సహించే విధంగా, సామూహిక దాడుల కేసులను నీరుగార్చే రీతిలో మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. జార్ఖండ్‌లో తబ్రేజ్ అన్సారీ కేసును నీరుగార్చే విధంగా పోలీసులు ఛార్జిషీట్ వేసి నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. దెబ్బలతో తబ్రేజ్ చనిపోతే గుండెపోటుతో మరణించినట్టు నివేదిక ఇచ్చారని అన్నారు.

188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles