లేఅవుట్ల పేర తాటి వనాల నరికివేత


Wed,August 14, 2019 01:05 AM

palm trees was cut down in the name of layout

-చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మోకుదెబ్బ విజ్ఞప్తి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లేఅవుట్ల పేరుతో రియల్‌ఎస్టేట్ సంస్థలు తాటి, ఈత చెట్లను నరికివేస్తున్నాయని, ఆబ్కారీ చట్టం ప్రకారం వీటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మోకుదెబ్బ కార్మిక కమిటీ కోరింది. కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీ నివాస్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. చెట్ల నరికివేతతో గీత వృత్తిదారులకు జీవనోపాధి దూరమవుతున్నదన్నారు. తాటి, ఈతవనాల నరికివేతకు అ నుమతులివ్వకుండా కలెక్టర్లకు ఆ దేశాలు జారీచేయాలని ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మంత్రిని కలిసినవారిలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, మోకుదెబ్బ ప్రతినిధులు నర్సాగౌడ్, ప్రసాద్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, వెంకటాద్రిగౌడ్ ఉన్నారు.

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles