రాష్ట్ర చరిత్ర, సంస్కృతి ప్రజలకు తెలియాలి


Wed,September 11, 2019 02:41 AM

People should know history of Telangana minister Sabitha Reddy

- గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని కాపాడండి
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర చరిత్ర, ఉద్యమం, సంస్కృతికి సంబంధించిన అన్ని విషయాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేవిధంగా గ్రంథాలయ సంస్థ చొరవ చూపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పూల బొకేలకు బదులుగా పుస్తకాలు బహూకరించాలని ఆమె ఇచ్చిన పిలుపుమేరకు.. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ మంగళవారం మంత్రికి మొదటి పుస్తకాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి పీఆర్వో, రచయిత గటిక విజయ్‌కుమార్ రాసిన ఉజ్వల ప్రస్థానం అనే పుస్తకాన్ని శ్రీధర్ మంత్రికి అందించారు. పూర్వయుగాల నుంచి తెలంగాణ చరిత్ర, రాజవంశాలు, తెలంగాణ ఉద్యమం, ప్రగతి తదితర అంశాలకు సంబంధించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని అందుకోవడం తనకు ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, మరిన్ని పుస్తకాల సేకరణకు తాను చొరవ చూపుతానని చెప్పారు. దాతలు, రచయితలు కూడా ముందుకొచ్చి గ్రంథాలయాల ప్రాముఖ్యతను కాపాడడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.

130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles