ఐఎంఎస్ స్కాం నిందితులకు పోలీస్ కస్టడీ

Fri,November 8, 2019 11:48 PM

- మూడ్రోజులపాటు విచారించనున్న ఏసీబీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోలు కుంభకోణంలో నిందితులను మూడ్రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, జేడీ డాక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిర, ఫార్మసిస్టు నాగలక్ష్మి, తేజాఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, అతడి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీకి అనుమతించింది. నిందితులను శనివారం నుంచి మూడ్రోజులపాటు కస్టడీకి తీసుకొని, మూడు డొల్ల కంపెనీల వ్యవహారం, మెడికల్ కిట్ల కొనుగోలులో అక్రమాలపై ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరించనున్నారు.

130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles