నేటినుంచి కొలకలూరి సాహితీ సప్తాహం

Fri,November 8, 2019 02:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహం శుక్రవారం నుంచి వారంపాటు హైదరాబాద్ త్యాగరాయగానసభలో జరుగనున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ సప్తాహ కార్యక్రమంలో ప్రతిరోజూ ఇనాక్ రచించిన ఒక్కో గ్రంథాన్ని ఆవిష్కరిస్తారని త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వీఎస్ జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం నవంబర్ 8న మొదటిరోజు రంది నవల, 9న గుడి షార్ట్‌స్టోరీస్, 10న పోలీ అంథోపాలజీ షార్ట్‌స్టోరీస్, 11న మిత్ర సమా సం (రీసర్చ్), అంబేద్కర్ జీవితం (బయోగ్రఫీ), 12న మనూళ్లలో మా కథలు షార్ట్ స్టోరీస్, 13న విశాల శూన్యం పద్య సంపుటి, 14న చలన సూత్రం షార్ట్ స్టోరీస్ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

75
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles