హైదరాబాద్, ఖమ్మంలో వర్షం

Tue,October 15, 2019 02:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ఖమ్మం వ్యవసాయం: క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి సాయం త్రం 6 వరకు ఆసిఫ్‌నగర్‌లో 0.9 సెం.మీ., ఖైరతాబాద్‌లో 0.8 సెం.మీ., హిమాయత్‌నగర్‌లో 0.6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 36 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు మండల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మంలో తేలికపాటి జల్లులు , ముదిగొండ, కల్లూరు, ఖమ్మం రూరల్, మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ముదిగొండ మండలంలో 1.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles