కేసీఆర్ బొమ్మతోనే గెలిచాం


Wed,September 11, 2019 02:39 AM

Ready to give my blood for TRS says gangula Kamalakar

-మంత్రిగా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు
-మీడియాతో మంత్రి గంగుల

కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశంలోనే అత్యంత మాననీయ కోణం ఉన్న మహనీయుడు సీఎం కేసీఆర్ అనీ, అందుకే ప్రజలు రెండోసారి అత్యధిక మెజార్టీనిచ్చి సం పూర్ణ అధికారం కట్టబెట్టారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బొమ్మ పెట్టుకోవడం వల్లే 88 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని వెల్లడించా రు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం కరీంనగర్‌కు వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అనేక ఏండ్లుగా తాను సీఎం కేసీఆర్‌ను దగ్గరునుంచి చూస్తున్నానని.. సీఎంలో ఉన్న మానవీయకోణం ఏ ఒక్కరిలోనూ కనిపించదన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి తాను మూడుసార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించిన క్రమంలో కొన్నిసార్లు మంత్రి పదవి ఆశించిన మాట వాస్తవమేననీ.. అయితే తమ నాయకుడు కేసీఆర్ ఏది చెపితే ఆ బాటలో నడిచామే తప్ప ఏనాడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు.

257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles