కేటీఆర్ చొరవతో ఒమన్ బాధితురాలికి విముక్తి


Wed,September 11, 2019 02:47 AM

Release of Oman victim with KTR initiative

-పనిమనిషిగా వెళ్ల్లి ఇబ్బందులకు గురైన బండారుపల్లి వాసి
-నేడు స్వగ్రామానికి శారద

శక్కర్‌నగర్ : బతుకుదెరువు కోసం ఓమన్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ మహిళ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాయంతో స్వదేశానికి తిరిగిరానున్నది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండారుపల్లికి చెందిన శారద ఓ ఏజెంటు ద్వారా ఒమన్‌లో పనిమనిషిగా వెళ్లింది. నెలరోజులపాటు పనిచేయించుకున్న ఓ షేక్ కుటుంబం.. ఆమె పాస్‌పోర్టు, మిగతా ఆధారాలను తీసుకుని వేధింపులకు గురిచేశారు. ఆమె తన కష్టాలను బండారుపల్లిలోని కుటుంబీకులకు తెలిపింది. తెలంగాణ జాగృతి నాయకుడు సిరివేసు సంతోష్‌కు ఆమె స్వయానా చిన్న మ్మ. స్పందించిన సిరివేసు సంతోష్ విదేశాల్లో ఉంటున్న బోధ న్ ఎమ్మెల్యే షకీల్ సమీ ప బంధువు సోహెల్ అహ్మద్‌కు విషయంపై ఫోన్‌లో వివరించారు. స్పందించిన సోహెల్ అహ్మద్ ఫోన్‌లో మంత్రి కేటీఆర్‌కు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ మస్కట్‌లోని ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వగ్రామానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. శారద బుధవారం మధ్యాహ్నం వరకు స్వగ్రామమై న బండారుపల్లికి చేరుకుంటుందని జాగృతి నాయకుడు సంతోష్ తెలిపారు.

417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles