ప్రాజెక్టుల నిర్మాణంలో అదే ఒరవడి


Tue,September 10, 2019 03:53 AM

Rs.8,476.17 crore to irrigated crop in Telangana Budget 2019 says CM KCR

- సాగునీటిశాఖకు రూ.8,476.17 కోట్లు కేటాయింపు
- కార్పొరేషన్‌ రుణాలతో నిధుల కొరత లేకుండా ప్రణాళిక
- భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టీకరణ
- 2018-19లో రికార్డుస్థాయిలో ఖర్చుచేసిన నీటిపారుదలశాఖ


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్‌ స్వప్నా న్ని సాకారం చేసే ప్రస్థానం ఇప్పటికే మొదలుకాగా.. ఇకముందు కూడా ఇదే ఒరవడిని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ప్రతిఏటా బడ్జెట్‌లో సాగునీటిరంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. ఈసారి కూడా ప్రభుత్వపర మూలధన వాటాతోపాటు ఆర్థికసంస్థల నుంచి రుణాల సమీకరణతో ప్రాజెక్టుల పనుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని నిర్ణయించింది. ఆర్థికసంస్థల నుంచి సమీకరించే రుణాల వివరాలను సాధారణంగా బడ్జెట్‌లో పొందుపరచడం లేదు. ప్రభుత్వపరంగా సాగునీటిరంగానికి ఇచ్చే వాస్తవిక నిధుల్ని బడ్జెట్‌లో రూ.8,476.17 కోట్లుగా చూపారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.7,794.30 కోట్లు, చిన్ననీటి వనరుల విభాగానికి రూ.642.36 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.1080.18 కోట్లను కేటాయించిన సర్కారు.. సీతారామ ప్రాజెక్టుకు రూ.1324 కోట్లు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.500 కోట్ల కేటాయింపుల్ని చూపింది.
irrigated-crop1
నిర్ణీత గడువులోగా పూర్తి.. ప్రాధాన్యక్రమాల ఆధారంగా ఇతర ప్రాజెక్టులకు కూడా కేటాయింపులు చేసింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి.. రైతులకు సాగునీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా నిధుల్ని వెచ్చిస్తూ పనుల్ని కొనసాగిస్తున్నది. ఇందుకుగాను కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఆర్థికసంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును సైతం కాళేశ్వరం కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. మూడేండ్లుగా ఒకవైపు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేపడుతూనే, మరోవైపు ఆర్థికసంస్థల రుణాలతో వేగంగా పనులను కొనసాగిస్తున్నది.
irrigated-crop2

భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను

వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థికసంస్థలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణంయథాతథంగా కొనసాగుతుంది..
- బడ్జెట్‌ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles