కేసీఆర్ పథకాలు ఆకర్షించాయి


Fri,March 15, 2019 02:17 AM

sabitha indra reddy praises cm kcr

-టీఆర్‌ఎస్‌తోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి
-అందుకే చేరుతున్నా: ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

సైదాబాద్: సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలినై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆమె తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి సైదాబాద్ తిరుమలహిల్స్‌లోని తీగల కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఎన్న డూ లేనంత అభివృద్ధిని చూస్తున్నామన్నారు. వెనుకబడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలుచుకోవటం ఖాయమని, అందరి సహకారంతో చేవెళ్లలో విజయం సాధించేలా కృషిచేస్తానన్నారు. తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సబితమ్మ రాకతో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరుపై నడకలా మారిందని పేర్కొన్నారు.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles