న్యాయశాఖ కార్యదర్శిగా సంతోష్‌రెడ్డి

Fri,November 8, 2019 01:52 AM

-ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: న్యాయశాఖ కార్యదర్శిగా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి ఏ సంతోష్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఏడాదిపాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నది. హైకోర్టుతో సంప్రదింపుల అనంతరం సంతోష్‌రెడ్డిని లీగల్, లెజిస్లేటివ్ ఎఫైర్స్ అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా నియమించినట్టు తెలిపింది. 1991లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సంతోష్‌రెడ్డి.. 2010లో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా ప్రమోషన్ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 నుంచి 2014 వరకు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2017 వరకు ఆయన లా సెక్రటరీగా సేవలు అందించారు. డిసెంబర్ 2018 నుంచి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles