రోగులకు ఉచితంగా సేవలు అందించండి


Wed,September 11, 2019 02:41 AM

Serve patients free of charge

ప్రైవేట్ దవాఖానలకు తెలంగాణ దవాఖానలు, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
బషీర్‌బాగ్: రాష్ట్రంలో విషజ్వరాలను అరిట్టేందుకు ప్రైవేట్ దావాఖానల యాజమాన్యాలు ఉచిత వైద్యసేవలు అందించాలని తెలంగాణ దవాఖానలు, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ (తానా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వై రవీందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ఎల్ సురేశ్‌గౌడ్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు డాక్టర్ లింగారావు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల అధిక ఒత్తిడిని తగ్గించేందుకు సామాజిక దృక్పథంతో ప్రతిరోజూ రెండు గంటలపాటు ఉచిత ఓపీని నిర్వహించాలని కోరారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగుల వైద్య పరీక్షలకు ప్రైవేట్ దవాఖాన యాజమాన్యాలు డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు ప్రైవేట్ దవాఖానల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద రూ.500 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.

178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles