సరిలేరు మీకెవ్వరు?


Mon,August 26, 2019 01:39 AM

siddipet dist farmers meet dharmaganta over revenue officers negligence

-భూరికార్డులను మార్చడంలో సాటిలేని రెవెన్యూ అధికారులు
-ధర్మగంటను ఆశ్రయించిన సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లి వాసి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకభూమిని ఎవరి పేరిటైనా క్షణాల్లో మార్చేయొచ్చని రెవె న్యూఅధికారులు మరోసారి నిరూపించారు. ఎలాంటి రికార్డులు చూడకుండానే భూముల ను ఒకరి పేరునుంచి మరొకరి పేరిట మార్చేస్తున్నారు. భూములు తారుమారు చేసినట్టు తేలిన తర్వాత కూడా ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. నిజమైన పట్టాదారులు తమపేరిట భూమి ఎంతకాలం ఉంటుందో.. ఎప్పు డు ఎవరిపేరిట మారుతుందో తెలియక.. మనశ్శాంతి లేక.. ఆందోళనకు గురవుతున్నారు. ఇదేవిధంగా రెవెన్యూ అధికారుల వైఖరితో విసిగిపోయిన సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు తమకు న్యాయంచేయాలని ధర్మగంటను ఆశ్రయించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లి గ్రామంలో 60/అ, 60/ఆ సర్వే నంబర్‌లో అన్నదమ్ములు గడ్డం వెంకటేశ్వర్‌రావు, గడ్డం శ్రీనివాస్‌రావుకు 2.38 ఎకరాల చొప్పున భూమి ఉన్నది. 1997-98లో వీరిద్దరూ కలిసి మూడెకరాల భూమిని నందనబోయిన ఎల్లయ్యకు విక్రయించారు. రెవెన్యూ అధికారుల ఎల్లయ్య పేరిట మూడెకరాలు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉండగా ఏకంగా 4.20 ఎకరాల భూమిని పహాణిలో నమోదుచేశారు. విక్రయించింది మూడెకరాలు కాగా నాలుగున్నర ఎకరాలు విక్రయించినట్టు రెవెన్యూ అధికారులు చూపించిన చేతివాటం భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా వెలుగుచూసింది.

ఈ భూమికి అసలైన పట్టాదారులైన ఇద్దరు సోదరులు చనిపోవడంతో వారి వారసులు భూమికోసం పోరాడుతున్నారు. విక్రయించిన భూమి కంటే ఎక్కువగా ఏవిధంగా పహాణిలో రికార్డులు మార్చారో ఆధారాలు ఇవ్వాలంటూ తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తమ కార్యాలయంలో రికార్డుల మార్పిడికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని 2018 జనవరి 23న తాసిల్దార్ కార్యాలయ అధికారులు లిఖితపూర్వకంగా లేఖలో సమాధానమిచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం పట్టాదారుల వంతయింది. రెవెన్యూ అధికారులుచేసిన తప్పులకు, ఇష్టారీతిన రికార్డులు మార్చడంతో తాము బలవుతున్నామని బాధితులు చెప్తున్నారు. రికార్డులు సరిచేయాలని కోరినా కూడా గత రెండేండ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారే కానీ రికార్డులు సరిచేయడంలేదని వాపోతున్నారు. వీఆర్వోలు, తాసిల్దార్లు మారుతున్నారే తప్ప తమ సమస్య పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యకు సంబంధించి బైరాన్‌పల్లి వీఆర్వో యాదగిరిని నమస్తే తెలంగాణ ధర్మగంట ప్రతినిధి సంప్రదించగా తాను ఇటీవలే గ్రామానికి వీఆర్వోగా వచ్చానని, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles