సింగపూర్‌తో వ్యాపారబంధం బలోపేతం

Wed,November 20, 2019 02:49 AM

-తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పూర్తి సహకారం
-సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధిబృందంతో మంత్రి కేటీఆర్
-ఫార్మా, మౌలిక సదుపాయాలు, టూరిజంలో సహకరిస్తాం
-కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియాన్ వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణతో సింగపూర్ వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవ్వాలని ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పలురంగాల్లో సింగపూర్ అనుభవాలను ఉపయోగించుకుంటామని చెప్పారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియాన్ నేతృత్వంలోని ప్రతినిధిబృందం మంగళవారం మాసాబ్‌ట్యాంకులోని మంత్రి కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్, తెలంగాణ మధ్య మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు. ఇప్పటికే అనేక కంపెనీలు, సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్.. కాన్సుల్ జనరల్‌కు తెలియజేశారు.

ఐటీరంగంలో శిక్షణ, ఫార్మా, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజం వంటి రంగాల్లో సింగపూర్ గణనీయ ప్రగతి సాధించిందని, ఈ రంగాల్లో తెలంగాణకు సహకారం అందిస్తామని కాన్సుల్ జనరల్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మాక్లస్టర్‌ను ఏర్పాటుచేస్తున్నదని, ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బాన జరొంగ్ మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నదని తెలిపారు. కాలుష్యరహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు సింగపూర్‌లాంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ గత ఐదేండ్లలో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందన్నారు. టీఎస్‌ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని అన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.
ITKTR1
సింగపూర్ నుంచి ముందుకొచ్చే కంపెనీల కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో ప్రత్యేకసమావేశాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో మౌలికవసతులను, ఇక్కడి ఎకో సిస్టం ను పరిశీలించేందుకు స్థానిక ఐటీ పార్కులు, టీ-హబ్ వంటి ప్రాంతాలను సందర్శించాలని కాన్సుల్ జనరల్‌ను మంత్రి కోరారు. వచే ఏడాది జరగనున్న బయో ఏషియా సదస్సులో సింగపూర్‌లోని ఫార్మా దిగ్గజాలను భాగస్వాములను చేసేందుకు కాన్సుల్ కార్యాలయం సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్ర భుత్వ పాలసీలు, ప్రాథమ్యాలపై మరింత స్పష్టత వచ్చిందని సింగపూర్ కాన్సుల్ జనరల్ తెలిపారు. ఇక్కడి ప్రభుత్వ నాయకత్వాన్ని చూశాక సింగపూర్ లాంటి దేశాలకు చెందిన కంపెనీలు స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఈ మేరకు సింగపూర్ పారిశ్రామికవర్గాల్లో తె లంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.

1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles