చిన్నారుల్లో స్మార్ట్ వ్యసనం


Wed,June 12, 2019 03:00 AM

Smartphone Addiction Causing Problems for Children

-పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తే డ్రగ్స్ ఇచ్చినట్టే
-పెరిగిన స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ క్లయింట్లు
-బానిసలుగా మారుస్తున్న మాధ్యమాలు
-ప్రముఖ అడిక్షన్ థెరపిస్ట్ సలిగరి హెచ్చరిక
-తాజా సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చిన్నారుల చేతిలో స్మార్ట్‌ఫోన్ పెడుతున్నారా! పిల్లలు గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌పై సమయం కేటాయిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటున్నారా? అయితే మీరు స్వయంగా చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్టే. చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వటం అనేది గ్రాము కొకైన్ ఇవ్వడంతో సమానమని ప్రముఖ అడిక్షన్ థెరపిస్ట్ డాక్టర్ మ్యాండి సలిగరి హెచ్చరించారు. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా మాధ్యమాలు యుక్తవయసులో ఉన్నవారిని డ్రగ్స్, మద్యంలాగే బానిసలుగా మార్చుకుంటున్నాయని లండన్ విద్యాసదస్సులో టీచర్లు అభిప్రాయపడ్డట్టు చెప్పారు.

టెక్నాలజీ అడిక్షన్ అనేది యువతలో పెరిగిపోతున్నదని, ముఖ్యంగా 16 ఏండ్లలోపు చిన్నారులు తప్పుదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. నేనెప్పుడు తల్లిదండ్రులకు ఒకటి చెప్తాను. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఇస్తున్నట్టయితే.. బాటిల్ మద్యం లేదా గ్రాము కొకైన్ ఇస్తున్నట్టే అని పేర్కొన్నారు. లండన్‌లో ఇటీవల 1500 మంది టీచర్ల ద్వారా సర్వే జరిపిన సర్వేలో పలు విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయని చెప్పారు. ఇంట్లో, పాఠశాలలో, ఇతర సమయాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగించడం అదుపులో పెట్టుకోవాలని, వ్యసనంగా మారే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గడిచిన పదేండ్లలో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ క్లయింట్ల రాక విపరీతంగా పెరిగిపోయిందని ఆయన తెలిపారు. దీన్ని ప్రాథమికస్థాయిలోనే నివారించేందుకు ప్రయత్నించాలని తల్లిదండ్రులకు సూచించారు.

లండన్‌లో టీచర్ల ద్వారా జరిపిన సర్వేలో వెల్లడైన అంశాలు

-పెద్దల దృష్టిలో పడనంత వరకు నగ్నచిత్రాలు, వీడియోలు షేరింగ్‌ను చాలా సాధారణ విషయంగా విద్యార్థులు భావిస్తున్నారు.
-ప్రతి నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు ప్రతి వారం సగటున ఆరున్నర గంటలపాటు ఇంటర్నెట్‌పై సమయం కేటాయిస్తున్నారు.
-విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ల ద్వారా సెక్సువల్ కంటెంట్ షేర్ చేసుకుంటున్నారని 2/3వ వంతులమంది టీచర్లు గుర్తించారు. ప్రాథమిక విద్యనభ్యసించే ప్రతి ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు ఇందులో ఉంటారు.
-పదిమంది తల్లిదండ్రుల్లో నలుగురే పిల్లల స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని నియంత్రిస్తున్నారు. మిగతా వారు పట్టించుకోవటం లేదు.
-స్వీయ నియంత్రణపై చిన్నారులకు తల్లిదండ్రులు, టీచర్లు అవగాహన కల్పించాలి.

4504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles