ఊరూరా ఉద్యమంలా..


Thu,September 12, 2019 03:57 AM

Special focus on development work proposals

-రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్న పల్లె ప్రగతి
-ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం
-పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు
-అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి
-ఉత్సాహంగా పాల్గొంటున్న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ : పల్లె ప్రగతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ఊరూరా ఉద్యమంలా సాగుతున్నది. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెల్లో బస చేస్తు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఖమ్మం, జోగుళాంబ గద్వా ల, నారాయణపేట నాగర్‌కర్నూల్, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొ ని ప్రజల్లో ఉత్సాహం నింపారు. వనపర్తి జిల్లా మదనాపురంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని జేసీబీ నడిపారు.

pp
-జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిదో రోజు పల్లెప్రగతి కార్యక్రమం జోరుగా సాగింది. గట్టు మండలం బోయిలగూడెంలో మంగళవారం రాత్రి బస చేసిన కలెక్టర్ తెల్లవారు జామునే గ్రామంలో పర్యటించారు. అయిజ మండలంలోని మేడికొండ గ్రామంలో ఆర్డీవో రాములు పర్యటించి గ్రామసలతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 538 గ్రామాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పండితాపురాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో ట్రైనీ కలెక్టర్ హన్మంతు కొడింబా పర్యటించి పనులను పర్యవేక్షించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరులో జరుగుతున్న పనులను జెడ్పీ సీఈవో ప్రియాంక పరిశీలించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం గ్రామాలలో డ్రైడేగా పాటించాలని అధికారులకు సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 42గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని మండలాల్లో డంపింగ్ యార్డులను సిద్ధం చేసే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. దసరా నాటికి డంపింగ్ యార్డులను సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

palle-pragathi2
పవర్ వీక్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనునున్నారు. బుధవారం వెల్దండలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, కల్వకుర్తి మండలంలో ఆర్డీవో రాజేశ్ పల్లె పాల్గొన్నారు. నారాయణపేట జిల్లాలో పల్లెప్రగతిలో భాగంగా కొనసాగుతున్న 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం మక్తల్ మండలం లింగంపల్లిలో కలెక్టర్ వెంకట్రావు గ్రామస్థులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే మరికల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో కాళిందిని, జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖరెడ్డి పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభించారు. మద్దూరు మండలం పదిరపాడులో మహిళా సంఘాలతో కలిసి జెడ్పీ సీఈవో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. నర్వ మండలం జక్కన్నపల్లిలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమాలను జెడ్పీటీసీ గౌని జ్యోతిరెడ్డి ప్రారంభించగా.. ఎంపీటీసీ శ్యామ్‌లాల్ ప్రజలతోకలిసి శ్రమదానం చేశారు. వనపర్తి జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. మదనాపురం మండలం నెలివిడిలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాత ఇండ్లను కూలగొట్టే పనులను చేపట్టారు. ఎమ్మెల్యే స్వయంగా జేసీబీ నడిపారు.

palle-pragathi3
-మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో కలెక్టర్ భారతి హోళికేరి ప్రజలతో కలిసి శ్రమదానం చేశారు. జైపూర్ మండలం పెగడపల్లిని జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి సందర్శించారు.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles