డిగ్రీ కాలేజీల్లో నేటినుంచి స్పాట్ కౌన్సెలింగ్


Wed,August 14, 2019 12:55 AM

Spot counseling from today in degree colleges

-ఈ నెల 18 వరకు గడువు: దోస్త్ కన్వీనర్ వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లభర్తీకి బుధవారం నుంచి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించుకొనేందుకు ఆయా కాలేజీలకు ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు దోస్త్-2019 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాలన్నారు. డిగ్రీ కాలేజీల్లో స్పాట్ కౌన్సెలింగ్‌కు అనుమతించడం ఇదే తొలిసారి. కాలేజీలవారీగా భర్తీ అయిన సీట్ల వివరాలను ఈ నెల 18న తిరిగి దోస్త్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేయాలని సూచించారు. దోస్త్ ప్రత్యేక డ్రైవ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఇందులో కొత్తగా ఏడువేలమంది రిజిస్ట్రేషన్ చేసుకోగా..మొత్తం 15,405 మంది వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. వీరికి బుధవారం సీట్ల్లు కేటాయిస్తామని దోస్త్ కన్వీనర్ తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం నాయకులు ఎస్వీసీ ప్రకాశ్, పరమేశ్వర్ హర్షం వ్యక్తంచేశారు.

84
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles