రాష్ట్రంలో స్థిరంగా అభివృద్ధి


Wed,September 11, 2019 02:18 AM

Stable development in the telangana

-రంగాలవారీగా జీఎస్డీపీలో పెరుగుతున్న ఆదాయం
-2011-12లో రూ.3,59,434 కోట్లున్న ఆదాయం
-ఈ ఏడాది రూ.8,65,688 కోట్లకు పెరుగుదల

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది. ఆర్థిక మాంద్యం వల్ల ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల వ్యవసాయరంగం గణనీయం గా వృద్ధిచెంది గత ఏడేండ్ల కంటే వంద శాతం అదనంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్)లో వ్యవసాయరంగం వాటా 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.54,615 కోట్లుండగా.. 2018-19లో రూ.1,12,495 కోట్లకు పెరిగింది. మత్స్య సంపద వాటా రూ.1,481 కోట్ల నుంచి రూ.4,099 కోట్లకు, పశు సంపద ఆదాయం రూ.18,848 కోట్ల నుంచి రూ.56,562 కోట్లకు చేరింది. ఆయా రంగాల్లో ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉన్నది. ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ గతేడాది కంటే ఈ ఏడాది అన్నిరంగాల్లో ఆదా యం పెరుగడం గమనార్హం. రాష్ట్రంలో అభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నదని సామాజిక ఆర్థిక సర్వే లెక్కలతో సహా తేల్చిచెప్పింది.
gstp

94
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles