ఐఏఎస్, ఐపీఎస్‌లకు భారీగా పదోన్నతులు


Wed,April 24, 2019 02:29 AM

State government gave promotions to 23 IPS officers and 26 IAS officers

-26 మంది ఐఏఎస్.. 23 మంది ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
-ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా
-కేంద్ర సర్వీసుల్లోని మరో ముగ్గురికి కూడా..

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారీస్థాయిలో పదోన్నతులు కల్పించింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారులు ఈ జాబితాల్లో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతపెద్ద ఎత్తున పదోన్నతులు ఇవ్వ డం ఇదే తొలిసారి. పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకొన్నది. ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి ప్రత్యేక ప్రధా న కార్యదర్శులుగా ప్రమోషన్ లభించింది. ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ మేరకు మంగళవారం పలు ఉత్తర్వులు జారీచేశారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా..

1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులైన జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా, జీపీఎం అండ్ ఏఆర్ ముఖ్య కార్యదర్శి శాలినీమిశ్రా, 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వాణిజ్యపన్నులు, ఆబ్కారిశాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న1987 బ్యాచ్ అధికారులు రాజీవ్‌రంజన్ మిశ్రా, వసుధామిశ్రా, జాతీయ మత్స్య అభివృద్ధిబోర్డు సీఈవో 1988 బ్యాచ్ ఐ రాణికుముదిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోటయ్యారు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచిఘోష్‌కు సూపర్‌టైమ్ (హెచ్‌ఏజీ) స్కేల్ పదోన్నతి వచ్చింది.

కార్యదర్శులుగా..

2003 బ్యాచ్‌కు చెందిన కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్, విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్, కాలుష్యనియంత్రణ మండలి సభ్య కార్యదర్శి పీ సత్యనారాయణరెడ్డిలకు సూపర్‌టైమ్ స్కేల్‌కింద కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. 2006 బ్యాచ్‌కుచెందిన మహబూబ్‌నగర్ కలెక్టర్ డీ రోనాల్డ్‌రోస్‌కు సెలక్షన్ గ్రేడ్ స్కేల్ పదోన్నతి లభించింది.

ఆమ్రపాలి, భారతి, హరిచందనలకు..

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులుగా 2010 బ్యాచ్‌కు చెందిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డీ దివ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, జాయింట్ సీఈవో ఆమ్రపాలి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ హరిచందన, డాక్టర్ ప్రీతిమీనాలకు పదోన్నతి లభించింది. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు అనురాగ్ జయంతి, గౌతంపొట్రు, పమేలాసత్పతి, రాహుల్‌రాజ్‌లకు సీనియర్ టైమ్ స్కేల్ పదోన్నతిచ్చారు. 2005, 2006 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు కన్ఫర్డ్ ఐఏఎస్‌లలో ఎం చంపాలాల్‌కు 2018 జనవరి 1 నుంచి, బీ భారతిలక్పతి నాయక్, బీ విజేంద్ర, కేవై నాయక్, కే సురేంద్రమోహన్‌లకు ఈ ఏడాది జనవరి నుంచి సెలెక్షన్ గ్రేడ్ పదోన్నతి వస్తుందని పేర్కొన్నారు.
TNGO

23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు

రాష్ట్రంలో 23 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. వారందరినీ ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. పదోన్నతి పొందినవారిలో 2001 బ్యాచ్ ఐపీఎస్‌లు నలుగురు ఉన్నారు. వీరందరికీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి లభించింది.

ఆరుగురు ఐజీలకు అదనపు డీజీలుగా

1994 బ్యాచ్‌కు చెందినవారిలో కేంద్ర సర్వీసుకు డిప్యుటేషన్‌పై వెళ్లిన రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ వినాయక్‌ప్రభాకర్‌కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించారు. గ్రేహౌండ్స్ ఐజీ కే శ్రీనివాస్‌రెడ్డి, ఐజీ (పర్సనల్) బీ శివధర్‌రెడ్డి, ఐజీ (వెల్ఫేర్) సౌమ్యామిశ్రా, హైదరాబాద్ ఏసీసీ (క్రైమ్స్) షికాగోయల్, టీఎస్‌ఎస్పీ ఐజీ అభిలాషబిస్త్‌లకు అదనపుడీజీలుగా పదోన్నతి వచ్చింది.

నలుగురు డీఐజీలకు ఐజీలుగా..

2001 బ్యాచ్‌కు చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్, రాచకొండ జాయింట్ సీపీ జీ సుధీర్‌బాబు, ఎస్‌ఐబీ డీఐజీ టీ ప్రభాకర్‌రావు, కరీంనగర్ డీఐజీ పీ ప్రమోద్‌కుమార్ ఐజీలుగా పదోన్నతి లభించింది. ప్రమోద్‌కుమార్‌కు డీఐజీ కరీంనగర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతోపాటు సీఐడీ ఐజీగా బాధ్యతలు అప్పగించారు.

2004 బ్యాచ్ నలుగురు ఐపీఎస్‌లకు..

ఇంటెలిజెన్స్ ఎస్పీ వీ శివకుమార్, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌లకు డీఐజీ ర్యాంకులో సూపర్ టైం స్కేల్ ప్రమోషన్ ఇచ్చారు.

2005 బ్యాచ్‌లో..

2005 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌లకు డీఐజీ ర్యాంకులో సూపర్‌టైం స్కేల్ పదోన్నతి లభించింది. హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా పనిచేస్తున్న అవినాశ్ మహంతి, సెంట్రల్ జోన్ డీసీపీ పీ విశ్వప్రసాద్, ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం రమేశ్‌లకు జాయింట్ సీపీలుగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగేలా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.

2006 బ్యాచ్‌లో..

2006 బ్యాచ్‌కు చెందిన కార్తికేయ, కే రమేశ్‌నాయుడు, వీ సత్యనారాయణ, బీ సుమతి, ఎం శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వరరావులకు ఐపీఎస్ పే మ్యాట్రిక్స్‌లో లెవల్13 ప్రమోషన్ ఇచ్చారు.

3132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles