సోర్గ్స్‌క్రాఫెన్ పర్వతంపై సూర్యనమస్కారాలు

Thu,October 10, 2019 02:53 AM

ఇప్పటివరకు తొమ్మిది పర్వతాలు అధిరోహించిన వెల్లుల్ల యువకుడు ప్రవీణ్
మెట్‌పల్లి రూరల్: ఆస్ట్రియా దేశంలోని సోర్గ్స్‌క్రాఫెన్ పర్వతాన్ని జగిత్యాల జిల్లా యువకుడు అధిరోహించారు. యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలనే సంకల్పంతో మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ, అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సూర్య నమస్కారాలుచేస్తూ రికార్డులు నెలకొల్పుతున్నారు. ఈక్రమంలో బుధవారం సోర్గ్స్‌క్రాఫెన్ పర్వతాన్ని అధిరోహించి 1,635 మీటర్లఎత్తులో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 26 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలను పూర్తిచేశారు. ఇప్పటివరకు తొమ్మిది ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. ప్రవీణ్ గుజరాత్ వడోదరలోని యోగానికేతన్‌లో యోగా శిక్షకునిగా పనిచేస్తున్నారు.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles