మాపై దుష్ప్రచారాన్ని నియంత్రించండి

Sat,November 9, 2019 01:31 AM

-దాడులను ప్రోత్సహించేలా సోషల్‌మీడియాలో ప్రచారం
-శాంతిభద్రతల అదనపు డీజీపీకి రెవెన్యూ జేఏసీ వినతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెవెన్యూ ఉద్యోగులపై దాడులను ప్రోత్సహించేలా సోషల్‌మీడియాలో జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే నియంత్రించాలని, ఈ రకమైన ప్రచారంచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ జేఏసీ.. పోలీస్‌శాఖను కోరింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి నేతృత్వంలో రెవెన్యూ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం అదనపు డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కారకులపైన చర్యలు తీసుకోకపోతే తాసిల్దార్ విజయారెడ్డి హత్య వంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని తాసిల్దార్ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని కోరారు. అంతకుముందు సీఎస్ కార్యాలయంలోనూ వినతిపత్రం అందజేసినట్టు వారు తెలిపారు. అదనపు డీజీపీని కలిసిన వారిలో రెవెన్యూ జేఏసీ ప్రతినిధులు ఎస్ రాములు, గరికె ఉపేందర్‌రావు తదితరులు ఉన్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా శాంతిభద్రతల అదనపు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న బెదిరింపులు, ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్ కోరారు.

110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles