లష్కర్‌లో గెలుపు ఖాయం


Sat,March 23, 2019 03:06 AM

Talasani Srinivas Yadav Election Campaign in Secunderabad For Lok Sabha

-హోంమంత్రి మహమూద్ అలీ
-25న ఎంపీ అభ్యర్థి నామినేషన్
-పాదయాత్రలు, కేటీఆర్ రోడ్‌షోల ద్వారా ప్రచారం
-సికింద్రాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి తలసాని

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రెండు సీట్లతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 16 సీట్లు గెలిపించడం ద్వారా కేంద్రంలో కీలకంగా వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తారని అన్నారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఎర్రకోటపై ఎవరు జెండా ఎగురవేసేది మనమే నిర్ణయించవచ్చన్నారు.

కేంద్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాదన్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రజాదరణ తగ్గిందనని చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఈనెల 25న సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ నామినేషన్ దాఖలుచేస్తారని తెలిపారు. గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభమవుతాయని, 3న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో, 5న అంబర్‌పేట, ముషీరాబాద్, 6న సికింద్రాబాద్, సనత్ నగర్‌లో రోడ్‌షోలు జరుగుతాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో 26 నుంచి పాదయాత్రలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం నాలుగు లక్షల మెజార్టీ వచ్చేలా కృషిచేయాలన్నారు.

సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్ మాట్లాడుతూ చిన్న వయస్సులో ఎంపీగా బరిలోకి దిగే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీలో యువతకు అవకాశాలు ఉంటాయని చెప్పడానికి తానే ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని.. మరో పార్టీకి ఇక్కడ అవకాశం లేదని, ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసుకుందామని చెప్పారు. సమావేశం లో ఎమ్మెల్యేలు గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, నామినెటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, టాం కాం చైర్మన్ రంగారెడ్డి, నాయకులు పీఎల్ శ్రీనివాస్, వీకే మహేశ్, ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు వల్లభ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరారు.

పలువురిని కలిసిన సాయికిరణ్‌యాదవ్

హోంమంత్రి మహమూద్‌అలీతోపాటు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్‌లను శుక్రవారం సికింద్రాబాద్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ కలిసి వారి మద్దతు కోరారు.

1519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles