అనేక కోణాల్లో ఆరా

Thu,October 10, 2019 02:34 AM

-ఐఎంఎస్ స్కాం నిందితులపై ప్రశ్నల వర్షం
-ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురి విచారణ
-నేడు మరోమారు ప్రశ్నించనున్న ఏసీబీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కుంభకోణంలో నిందితులపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 13 మందిని ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కీలక సూత్రధారులుగా భావిస్తున్న ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, వరంగల్ జేడీ డాక్టర్ కే పద్మతోపాటు ఐఎంఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్టోర్స్) డాక్టర్ కే వసంత ఇందిర, శంషాబాద్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ గ్రేడ్- 2 ఫార్మసిస్టు ఎం రాధిక, ఎంఐఎస్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఓమ్నీ మెడి ఎండీ కే శ్రీహరిబాబు అలియాస్ బాబ్జి, ఓమ్నీ మెడి రిప్రెజెంటేటివ్ నాగరాజును బుధ, గురువారాల్లో రెండురోజులపా టు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించిన విష యం తెలిసిందే. ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ స్కాంలో ముఖ్య సూత్రధారి అయిన ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తున్నట్టు సమాచారం.


-పక్కా ఆధారాలు చూపుతూ ప్రశ్నలు
సోదాల్లో పట్టుబడిన కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాలను ఇప్పటికే విశ్లేషించుకున్న ఏసీబీ.. నిందితులకు వాటిని చూపుతూ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా డిస్పెన్సరీల నుంచి సేకరించిన పలు పత్రాలను సైతం వీటిలో చేర్చినట్టు సమాచారం. స్కాంలో ఎవరి స్థాయిలోవారు అందినకాడికి దోచుకున్న దానికి ప్రాథమికంగా ఆధారాలు ఇప్పటికే సేకరించిన అధికారులు వాటిపై మరింత లోతైన సమాచారాన్ని నిందితుల నుంచి రాబడుతున్నారు. మొత్తం ఏడుగురు నిందితులకు వేర్వేరు ప్రశ్నావళిని రూపొందించికొని మరీ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఒకే అంశానికి సంబంధించి వారు చెప్తున్న సమాధానాలను రికార్డు చేస్తున్నట్టు సమాచారం. గురువారం మరికొన్ని అంశాలపై ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles