వైద్యవిద్యకు ప్రాధాన్యం


Wed,September 11, 2019 03:32 AM

Telangana Health Minister Etela vows to revamp dilapidated Osmania Medical College

- రాష్ట్రం ఏర్పడ్డాక ఐదు వైద్యకళాశాలలు ప్రారంభం
- మరో రెండు కాలేజీల కోసం కేంద్రానికి ప్రతిపాదన


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సర్కారు దవాఖానాల ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్యసేవలను అందించడమే కాకుండా భవిష్యత్ తరాలకు ప్రతిభావంతులైన వైద్యులను అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. వైద్యవృత్తిని చేపట్టాలన్న విద్యార్థుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం వినూత్న విధానాలను అవలంబిస్తుండటంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు మెరుగుపడటంతోపాటు ఏటా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా పెరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో కొత్తగా 5 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభు త్వం అనుమతించింది. కొత్తగా మరో రెండుచోట్ల వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదించారు. అంతేకాకుండా విద్యార్థులకు బోధకుల కొరత ఉం డకూడదన్న ఉద్దే శంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్య బోధకుల పదవీ విరమణ వయసును 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచింది.

రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు

రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వీటిలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్ వైద్యకళాశాలలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండగా.. 2013-14 విద్యా సంవత్సరంలో నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2016-17 విద్యాసంవత్సరంలో మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల, హైదరాబాద్‌లో ప్రభుత్వ ఈ ఎస్‌ఐ వైద్య కళాశాలను, 2018-19 విద్యాసంవత్సరంలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలను, 2019-20 విద్యాసంవత్సరంలో నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాలలను అందు బాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,450కు పెరిగింది.
Etela-Rajender1

వైద్య కళాశాలలను పటిష్ఠం చేస్తున్నాం

తెలంగాణలోని పేద విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను పటిష్ఠం చేస్తున్నం. రాష్ట్రంలో వైద్యసేవల అవసరాలకు అనుగుణంగా వైద్యుల సంఖ్య పెరుగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికోసం వైద్య కళాశాలల్లో నాణ్యమైన బోధన అందించగలిగే అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల సేవలు అవసరమున్నందున సీఎం కేసీఆర్ టీచింగ్ హాస్పిటల్స్‌లో పనిచేసే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 65 ఏండ్లకు పెంచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఎయిమ్స్‌సహా ఇప్పటివరకు ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలను సాధించుకున్నది. కొత్తగా ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరాం. ఈ విజ్ఞప్తికి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు.
- ఈటల రాజేందర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles