దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం


Tue,September 10, 2019 03:55 AM

Telangana is the most developed state in the country

- తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,05,696
- 126 శాతం పెరుగుదల.. సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసలు
- జాతీయస్థాయి కంటే 3.8 శాతం అదనంగా పెరిగిన తలసరి ఆదాయం
- రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలో రికార్డుస్థాయిలో హామీల అమలు


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఐదేండ్లలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రత్యేకతను సాధించింది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచింది. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా హామీలు ఇచ్చిన పాలకులు రికార్డుస్థాయిలో వాటిని నెరవేర్చారని, తెలంగాణ రాష్ట్రం అనేక అంశాలలో అత్యుత్తమ ప్రగతిని సాధించిందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్‌ పద్దులతోపాటు సభ్యులకు సామాజిక ఆర్థికసర్వే-2019ను అందజేశారు. ఆయా రంగాలవారీగా జరిగిన అభివృద్ధి తీరును, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ఈ సర్వే విశ్లేషించింది. బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్రం పయనిస్తున్నదని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, వాటి ఫలితాలు కండ్లముందు కనిపిస్తున్నాయని వివరించింది. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలకు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశసంలు లభించాయని పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలోనే వినూత్నమైన పథకాలను ఆవిష్కరించిందని, గతంతో పోలిస్తే పాలనలో ఆధునిక సంస్కరణలు చేపట్టి మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నదని సర్వే తెలిపింది.
Telangana-Economic1

విద్యుత్‌ సమస్య పరిష్కారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్రమైన విద్యుత్‌ సమస్య ఉన్నది.. కరంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆనాడు అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని పరిశ్రమలు షిఫ్ట్‌ పద్ధతిలోపనిచేసేవి. నేడు విద్యుత్‌ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. రైతులకు, పరిశ్రమలకు.. ఇలా అన్నివర్గాల ప్రజలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. నాడు తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడేవారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల అంచనాలు అధికంగా ఉన్నాయి. అనేక సవాళ్లకు ఎదురీదిన తెలంగాణ ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగిన విధంగా, ప్రతి సమస్యను ఒక అవకాశంగా మలుచుకొని మొరుగైన ఫలితాలు సాధించిందని సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం జాతీయస్థాయికంటే 3.8 శాతం అదనంగా పెరిగింది.
Telangana-Economic2

ఏడేండ్ల్లలో 126 శాతం పెరిగిన తలసరి ఆదాయం

తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం గడిచిన ఏడేండ్లలో 126 శాతం పెరిగింది. 2011-12లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.91,121 ఉండగా 2018-19 నాటికి రూ. 2,05,696 కు పెరిగిందని సర్వే తెలిపింది. ఇదే సమయంలో భారతదేశ సగటు తలసరి ఆదాయం 2011-12లో రూ.63,462 నుంచి 2018-19లో రూ.1,26,406కు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదల జాతీయస్థాయిలో 100 శాతం మాత్రమే ఉన్నది. తెలంగాణ అభివృద్ధి రేటు 2012-13లో 10.8 శాతం ఉండగా.. అది 2018-19 నాటికి 13.8 శాతానికి పెరిగింది. అదే జాతీయస్థాయిలో 2012-13లో 11.9 శాతం ఉన్న తలసరి ఆదాయం గ్రోత్‌రేట్‌ 2018-19 నాటికి 10 శాతానికి తగ్గింది.

536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles