జడ్జీల పోస్టుల్లో ప్రాతినిధ్యం కల్పించండి


Wed,September 11, 2019 01:56 AM

Telangana Woman lawyers seek judge posts

- హైకోర్టు సీజే చౌహాన్‌కు మహిళా న్యాయవాదుల విజ్ఞప్తి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: న్యాయవాదుల నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమించడంలో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని పలువురు మహిళా న్యాయవాదులు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తిచేశారు. సోమవారం చీఫ్ జస్టిస్‌ను కలిసిన వారు.. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని న్యాయవాదులుగా రాణిస్తున్నామన్నారు. హైకోర్టు చరిత్రలో 212 మంది న్యాయమూర్తులుగా ఎంపిక వగా.. వీరిలో ఎనిమిది మంది మాత్ర మే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో బార్ అసోసియేషన్ నుంచి 1977లో జస్టిస్ అమరేశ్వరి, 1998లో మీనాకుమారి, 2001లో రోహిణి, 2017లో విజయలక్ష్మి న్యాయమూర్తి అయ్యారని చెప్పారు. మహిళా న్యాయవాదులకు ఎంత అన్యాయం జరుగుతున్నదో వీటి ద్వారా తెలుస్తున్నదని, మహిళా లాయర్లను జడ్జీలుగా ఎంపికచేయడానికి సుప్రీంకోర్టు కొలీజియంకు సిఫార్సు చేయాలని కోరారు.

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles