పసికందు మృతదేహానికి పోస్టుమార్టం


Wed,September 11, 2019 02:12 AM

The postmortem to infant carcass

రాయపర్తి: వరంగల్‌రూరల్ జిల్లా రాయపర్తి మండలం ఎర్రకుంట తండాలో నాలు గు రోజుల పసిగుడ్డు అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా మంగళవారం పోస్టుమార్టం చేశారు. ఎర్రకుంటతండాకు చెంది న భూక్య మమత-తిరుపతిలకు ఈ నెల 4న రెండో సంతానంగా జన్మించిన ఆడశిశువు 7వ తేదీ సాయంత్రం మృతి చెందడంతో వ్యవసాయ భూముల వద్ద కుటుం బ సభ్యులు ఖననం చేశారు. పసికందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యా యి. ఈ నేపథ్యంలో మంగళవారం ఫోరెన్సిక్ డాక్టర్ సురేందర్ నేతృత్వంలో వైద్యు ల బృందం ఖననం చేసిన స్థలాన్ని తవ్వి శవ పరీక్ష నిర్వహించింది. ఫోరెన్సిక్ వైద్య బృందం అందజేసే నివేదిక ఆధారంగా విచారణ కొనసాగనున్నది.

479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles