ఉర్దూ స్కూళ్ల సమస్యలు పరిష్కరించాలి

Fri,November 8, 2019 02:10 AM

-విద్యాశాఖ అధికారులకు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమరుద్దీన్ సూచన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో ఉర్దూ మీడియం పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులను మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమరుద్దీన్ ఆదేశించారు. నగరంలోని పలు ఉర్దూ స్కూళ్లు మూతపడిన విషయం కమిషన్ దృష్టికిరావడంతో గురువారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు ఉర్దూ మీడియం పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు ఉన్న కారణంగా వాటిని మూసేయాల్సి వచ్చిందని విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ రాజేశ్వరి, హైదరాబాద్ డీఈవో వెంకటనర్సమ్మ చైర్మన్ ఖమరుద్దీన్‌కు వివరించారు. ఆ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉంటే తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఉర్దూ మీడియం పాఠశాలల పూర్తి వివరాలను కమిషన్‌కు సమర్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కమిషన్ కార్యదర్శి హరీశ్‌చందర్ సాహు, సలహాదారు పన్నగ సాయి పాల్గొన్నారు.

142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles