నియమావళిని పాటించాల్సిందే

Thu,October 10, 2019 03:17 AM

-హుజూర్‌నగర్‌లో ప్రచారం
-పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికల్లో పోటీచేయడం, ప్రచారం చేసుకోవడం చట్టబద్ధమైన హక్కు అని, అయితే, ఎన్నికల నియమావళి ప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని ప్రచారం చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. తనను హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్ హైకోర్టులో బుధవారం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది టీ శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నిర్ధారించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను పిటిషనర్ పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎంసీసీ ప్రకారం సభలు, సమావేశాలు, ప్రచారానికి అవసరమైన అనుమతులను సంబంధిత అథారిటీ నుంచి పొందాలని అన్నారు. ప్రచారానికి పిటిషనర్ అనుమతి తీసుకోలేదని తెలిపారు. అనుమతి తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఎంసీసీ ప్రకారం వ్యవహరించాలని, సరైన అనుమతులు తీసుకొని ప్రచారం చేసుకోవాలని, అనుమతులు ఉంటే ప్రచారం విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. చట్టం ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles